Breaking News

నా ప్రవర్తనకు క్షమాపణలు కోరుతున్నా..  ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్

12 th Jan 2021, UTC

భారత్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో తన ప్రవర్తనకు క్షమాపణలు కోరుతున్నానని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్  తెలిపాడు. తాను మైదానంలో తాను ఇంకా మెరుగ్గా ప్రవర్తించాల్సిన అవసరం ఉందన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హనుమ విహారీ, రవిచంద్రన్ అశ్విన్ నిలకడైన బ్యాటింగ్‌తో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. అయితే ఈ ఇద్దరి కాంబోను దెబ్బతీయాలని పైన్. స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. అశ్విన్‌ పట్ల అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. మూడో రోజు ఆటలో పుజారా ఔట్ కోసం పైన్ అంపైర్ విల్సన్ ‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసభ్యపదజాలంతో దూషించాడు. దాంతో పైన్‌పై ఐసీసీ నిబంధన 2.8 ప్రకారం మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు. దీనిపై పైన్ మాట్లాడుతూ ఆవేశంలో అసభ్యకరంగా మాట్లాడనని, కానీ అంపైర్‌ను తిట్టాలని కాదని క్లారిటీ ఇచ్చాడు. తాను మరింత మెరుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నాడు.

గత రెండు మ్యాచ్‌ల కన్నా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినా విజయం దక్కలేదన్నాడు.‘ఫలితాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. మా బౌలర్లు చాలా బాగా ఆడారు. మంచి అవకాశాలు వచ్చాయి. క్యాచ్‌లు వదిలేయడం నేను చేసిన పెద్ద తప్పని  'అని పైన్ అన్నాడు. భారత ఆటగాళ్లు ఇచ్చిన మూడు క్యాచ్‌లను పైన్ వదిలేసాడు. దాంతో అతను స్లెడ్జింగ్ కు దిగాడు .

లైయన్‌ బౌలింగ్‌లో బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేని అశ్విన్‌. చెస్ట్ గాడ్ కోసం క్రీజు నుంచి దూరంగా వెళ్లి తిరిగి వచ్చినపుడు. ''గబ్బా (చివరి టెస్టు వేదిక)కు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు ఆత్రుతగా ఉన్నా యాష్‌. చెప్పింది అర్థమైందా'' అని పైన్‌ రెచ్చగొట్టాడు. ‘మేం కూడా మిమ్మల్ని భారత్‌కు రప్పించాలనే తొందరలో ఉన్నాం. నీకది చివరి సిరీస్‌ అవుతుంది' అని అశ్విన్‌మాధానమిచ్చాడు. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox