Breaking News

చెన్నైకి ధోనికి ఉన్న బంధమలాంటిది..!

30 th Oct 2020, UTC
చెన్నైకి ధోనికి ఉన్న బంధమలాంటిది..!

న్యూఢిల్లీ :ఐపీఎల్ 2020 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించినంతగా విజయం సాధించలేదన్న సంగతి తెలిసిందే. అయితే.ధోని ఆటతీరుపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, ధోని అభిమానులు మాత్రం ఆయన వెంట నిలిచారు. ఈ నేపధ్యంలో ఇటీవల భారత క్రికెట్‌ జట్టు మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఐపీఎల్ సీజన్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ధోనిని జట్టు కెప్టెన్ గా తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. 

ఈ మేరకు గంభీర్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. " ప్టెన్‌-యజమానుల మధ్య బలమైన బంధానికి చెన్నై ఉదాహరణ. వాళ్లు ఎంఎస్‌కు ఎంతో స్వేచ్ఛనిచ్చారు.  మరెంతో గౌరవించారు. ఆడినంతకాలం పాటు ధోనిని వారు కెప్టెన్ గా కొనసాగించినా ఆశ్చర్యపోను, రాబోయే సీజన్ లో మహి కొత్త జట్టుతో బరిలో దిగే ఛాన్స్ ఉంది. చెన్నైకి ధోని చాలా చేసాడు. మూడు ఐపీఎల్ ట్రోఫీలు ఇచ్చాడు. అందుకే చెన్నై యాజమాన్యం  ధోనికి ఎంతో విలువనిస్తుంది. ధోని కూడా తన పూర్తి సామర్ధ్యంతో ఆడతాడు. సీఎస్‌కేకు కెప్టెన్సీ చేస్తున్నప్పుడు ధోని ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాడు." అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox