Site icon Prime9

Gautam Gambhir: టీమిండియా డ్రెస్సింగ్ రూంలో లుకలుకలు.. కోచ్ గంభీర్ వ్యాఖ్యలు లీక్!

Gautam Gambhir amid reports of dressing-room dressing down: ఆస్ట్రేలియాతో భారత్ ఐదో టెస్ట్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా డ్రెస్సింగ్ రూంలో లుకలుకలు వినిపిస్తున్నాయి. ప్రధాన కోచ్ గంభీర్ చేసిన గంభీరమైన వ్యాఖ్యలు లీక్ కావడంతో పాటు ఈ మేరకు గంభీర్ కామెంట్స్‌లో వివరణ ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో భాగంగా భారత్ ఘోర పరాజయాలు చెందుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లో ఘోర ఓటమి చవిచూడగా.. ఒక్క మ్యాచ్‌లో మాత్రము గెలిచింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో డ్రెస్సింగ్ రూంలో చేసిన వ్యాఖ్యలపై కోచ్ గౌతమ్ గంభీర్ వివరణ ఇచ్చారు. తాను చెప్పినట్లే జరగాలని కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

తాజాగా, కోచ్ గౌతమ్ గంభీర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి మధ్య సంభాషణ డ్రెస్సింగ్ రేమ్ కే పరిమితం కావాలని అన్నారు. నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడడం అనేది ఉండదని, ఏ అంశంపై ఫోకస్ చేయాలన్న దానిపై టీంలో అందరికీ తెలుసు అని వివరణ ఇచ్చారు. అయితే డ్రెస్సింగ్ రూంలో రేపటి టెస్ట్ మ్యాచ్ గురించి కాకుండా మరో చర్చ జరగలేదని చెప్పారు. క్రీడల్లో జట్టుగా గెలుస్తామని, జట్టుతో ఓడిపోతామన్నారు.

దేశం కోసం ఆడుతున్న సమయంలో శక్తివంచన లేకుండా ఆడటానికి ప్రతి ఆటగాడు కృషి చేస్తాడన్నారు. ఆటగాడికి, కోచ్‌కు మధ్య జరిగే సంభాషణ వారిద్దని మధ్యే ఉంటుందన్నారు. మంచి లేదా చెడు క్రీడలను కేవలం గెలుపు, ఓటమిగానే చూస్తారన్నారు. ఇద్దరి మధ్య జరిగే సంభాషణ డ్రెస్సింగ్ రూంకే పరిమితం కావాలన్నారు. అయితే తర్వాతి టెస్ట్ మ్యాచ్ ఎలా గెలవాలన్న అంశంపైన చర్చించామన్నారు. ఇది కాకుండా ఎలాంటి చర్చ జరగలేదని, రాబోయే టెస్ట్ ఎంత ముఖ్యమో మాకు తెలుసున్నారు.రోహిత్‌తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే గంభీర్, రోహిత్ మధ్య ఘర్షణ ఇక్కడితో ముగుస్తుందా లేదా అనే విషయంపై సస్పెన్స్ నెలకొంది.

Exit mobile version