Uttar Pradesh: అది యూపీలోని అలీఘర్ పట్టణం. అక్కడ స్టేడియం సమీపంలోని ఎల్పీజీ పంపిణీ సంస్థ యొక్క స్టోరేజ్ కాంపౌండ్ ఆవరణలో ఒక చిన్న రెండు గదుల ఇల్లు వుంది. ఐపిఎల్ వేలం తర్వాత అది కొద్ది రోజుల్లోనే పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అది షారుఖ్ ఖాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ చేత ఎంపిక చేయబడిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆల్ రౌండర్ రింకూ సింగ్ ఇల్లు. సోమవారం, రింకు 42 (23 బంతుల్లో, 6×4, 2×6) చేయడంతో రాజస్థాన్ రాయల్స్‌పై కోల్ కతా నైట్ రైడర్స్ ఒక ముఖ్యమైన విజయాన్ని నమోదు చేసింది. అయితే రింకూ ఐపిఎల్ ప్లేయర్ కావడం వెనుక పెద్ద కధే వుంది.
రింకూ తండ్రి ఖాన్చంద్ర ఎల్పీజీ సిలిండర్లను ఇళ్లకు పంపిణీ చేస్తుంటాడు. ఒక అన్నయ్య ఆటోరిక్షా నడుపుతుండగా మరో సోదరుడు కోచింగ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన వేలం యుద్దం తరువాత రింకూను రూ. 80 లక్షలకు కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. దీనిపై రింకూ సింగ్ మాట్లాడుతూ తనను రూ.20 లక్షలకు తీసుకుంటారని భావించానని అయితే ఊహించని విధంగా రూ. 80 లక్షలకు తీసుకున్నారని సంతోషం వ్యక్తం చేసాడు. ఈ డబ్బుతో నా పెద్ద తమ్ముడి పెళ్లి చేయడమే కాకుండా చెల్లెలి పెళ్లికి కూడ కొంత పొదుపు చేస్తానని అన్నాడు. అన్నిటికన్నాముఖ్యంగా ప్రస్తుతం వున్న ఇంటి నుంచి మంచి ఇంటికి షిఫ్ట్ అవడం ముఖ్యమని పేర్కొన్నాడు.
ఐదుగురు తోబుట్టువులలో మూడవ వాడయిన రింకూ చాల కష్టాలను ఎదుర్కొన్నాడు. మూడేళ్ల క్రితం అతని కుటుంబం రూ.ఐదు లక్షల అప్పులు చేసి తిరిగి చెల్లించలేక ఇబ్బంది పడింది. రింకూ చదువులో పూర్. అతను తొమ్మిదోతరగతి ఫెయిల్ అయ్యాడు. చిన్నప్పటినుంచి అతను గంటలకొద్దీ క్రికెట్ ఆడుతూ గడిపాడు. దానితో అందులోనే భవిష్యత్తును వెతుక్కోవాలని అనుకున్నాడు. అతను యూపీ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నపుడు అందుకున్న అలవెన్స్ లను పొదుపు చేసి కుటుంబానికి ఇచ్చాడు. భారత్ తరపున అండర్-19 జట్టుకు ఎంపిక అవుతానని భావించాడు కాని అలా జరగలేదు. ఢిల్లీలో జరిగిన ఒక టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కైవసం చేసుకున్న తర్వాత మోటార్ సైకిల్‌ను గెలుచుకోవడంతో రింకూ కుటుంబం కూడా అతనిని నమ్మడం ప్రారంభించింది. అలీగఢ్ అంతటా అతని తండ్రి సిలిండర్లను డెలివరీ చేయడానికి మోటార్‌సైకిల్ ఉపయోగపడింది. అయితే తరువాత కూడ పరిస్దితుల్లో పెద్దగా మార్పు రాలేదు. ఒకరోజు అతను తన అన్నతో తనకు ఎక్కడైనా పని ఇప్పించమని అడిగాడు. అతడు వెంటనే ఒకప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడవారు స్వీపర్ గా పనిచేయమన్నారు. దానితో అతను ఇంటికి తిరిగి వచ్చి అటువంటి పని తాను చేయలేనని తాను క్రికెట్ లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటానని తెలిపాడు.
తొమ్మిది రంజీ ట్రోఫీ మ్యాచుల్లో రింకూ 49 సగటుతో 692 పరుగులు చేసిన తరువాత అతనికి గుర్తింపు వచ్చింది. గత సంవత్సరం, కింగ్స్ XI పంజాబ్ అతడిని ఎంపిక చేసింది. ఇపుడు కెకెఆర్ ఇంత భారీ మొత్తం చెల్లిస్తుందని తాను అనుకోలేదని రింకూ తెలిపాడు. తన వంశంలో ఇంత డబ్బు ఎవరూ చూడలేదని చెప్పాడు. మరి చిన్నపట్టణాలు,నగరాలనుంచి వచ్చే వారికి రింకూ స్టోరీ స్పూర్తిగా నిలుస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

Read latest క్రీడా వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022