Breaking News

కరోనా తో మాజీ క్రికెటర్ మృతి..!

30 th Jun 2020, UTC
కరోనా తో మాజీ క్రికెటర్ మృతి..!

కరోనా వైరస్‌ బారిన పడి ఢిల్లీ మాజీ క్రికెటర్‌ సంజయ్‌ దోబల్‌ మృతిచెందారు. సంజయ్‌  కు మూడు వారాల క్రితమే కరోనా లక్షణాలు కనిపించగా, ఆదివారం ఆయన పరిస్థితి విషమించింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. మరొకవైపు ప్లాస్మా థెరఫీ కూడా చేయించినా ఫలితం లేకుండా పోయిందని ఆయన సన్నిహితుడు ఒకరు తెలిపారు.

క్లబ్‌ క్రికెట్‌లో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సంజయ్‌ దోబల్‌.. ఢిల్లీ అండర్‌-23 జట్టుకు సపోర్టింగ్‌ స్టాప్‌కు కూడా సేవలందించారు.సంజయ్‌కు రంజీ ట్రోఫీ ఆడిన అనుభవం లేకపోయినా జూనియర్‌ క్రికెటర్లతో మంచి సాన్నిహిత్యం కల్గి ఉండేవాడు. ఆ క్రమంలోనే గౌతం గంభీర్‌తో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.

 సంజయ్‌ పరిస్థితి విషమించిన క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ ప్లాస్మా థెరఫీ కోసం అప్పీల్‌ చేశారుసంజయ్‌ కోసం డోనర్‌ కావాలంటూ ట్వీటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు. కాగా, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఎంఎల్‌ఏ దిలీప్‌ పాండే.. సంజయ్‌కు డోనర్‌ను ఏర్పాటు చేసినా ఫలితాన్ని ఇవ్వలేదు.

. 53 ఏళ్ల సంజయ్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు సిదాంత్‌ రాజస్తాన్‌ తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడుతుండగా, చిన్న కుమారుడు ఎకాన్ష్‌ అండర్‌-23 జట్టులో ఢిల్లీ తరుఫున అరంగేట్రం చేశాడు.  సంజయ్‌ మృతిపై ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox