Breaking News

అన్ని ఫార్మాట్లకు గుడ్ బై అన్న డివిలియర్స్

19 th Nov 2021, UTC

దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్‌ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లుగా శుక్రవారం ట్విటర్‌లో ప్రకటించాడు. డివిలియర్స్‌ నిర్ణయంపై ఆర్‌సీబీ సహచర ఆటగాడు.. చిరకాల మిత్రుడు విరాట్‌ కోహ్లి ట్విటర్‌ వేదికగా ఎమోషనల్‌ అయ్యాడు. 

'ఏబీ డివిలియర్స్‌..  నీ నిర్ణయం నా గుండెను ముక్కలు చేసింది. కానీ సరైన సమయంలోనే ఆటకు గుడ్‌బై చెప్పాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.  ఇక మా కాలంలో నువ్వొక అత్యుత్తమ ఆటగాడివి. నేను కలుసుకున్న అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తివి. ఆర్‌సీబీకి నీతో కలిసి ఆడిన క్షణాలు ఎప్పటికి గుర్తుండిపోతాయి.. అంతేకాదు దానిని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఆటకు గుడ్‌బై చెప్పినప్పటికి మన బంధం బయట కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.. చివరగా ఐ లవ్‌ యూ డివిలియర్స్‌.'' అంటూ ముగించాడు. కాగా కోహ్లి ట్వీట్‌పై స్పందించిన ఏబీ.. ''లవ్‌ యూ టూ బ్రదర్‌'' అంటూ రిప్లై ఇవ్వడం విశేషం.

డివిలియర్స్ ఆర్ సి బి తరపున 156 మ్యాచ్‌లు ఆడాడు, అక్కడ అతను 4, 491 పరుగులు చేశాడు. అతను విరాట్ కోహ్లి తర్వాత  ఆర్ సి బి యొక్క రెండవ ఆల్-టైమ్ అత్యధిక పరుగుల స్కోరర్ . అతను ముంబై ఇండియన్స్ (2015లో)పై 133 నాటౌట్  మరియు గుజరాత్ లయన్స్ (2016లో)పై 129 నాటౌట్ తో  ఆర్ సి బి చరిత్రలో రెండవ మరియు మూడవ అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు కలిగి ఉన్నాడు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox