Breaking News

కోహ్లి అభిమానుల క్లబ్ లో వార్నర్ కుమార్తె

20 th Nov 2020, UTC

విరాట్ కోహ్లి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వర్ధమాన క్రికెటర్లకు రోల్ మోడల్. తాజాగా అతని అభిమానుల క్లబ్‌లోఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్ మాన్ డేవిడ్ వార్నర్ రెండవ కుమార్తె చేరింది. ఈ విషయాన్ని వార్నర్ భార్య స్వయంగా చెప్పడం విశేషం.

రేడియో చాట్ షోలో వార్నర్ భార్య కాండిస్ ఇటీవల తన మధ్య బిడ్డ విరాట్ కోహ్లీకి పెద్ద అభిమాని అని వెల్లడించారు. వీరికి ముగ్గురు బాలికలు ఐవీ-మే (6), ఇండి-రే (4), ఇస్లా రోజ్ (1) ఉన్నారు. అయితే రెండవ కుమార్తెకు రికీ పాంటింగ్ మరియు ఆడమ్ గిల్‌క్రిస్ట్ కాకుండా భారత కెప్టెన్ కోహ్లీ అంటే అభిమానం. 

ట్రిపుల్ ఎమ్ సిడ్నీ రేడియో స్టేషన్‌తో  కాండిస్ మాట్లాడుతూ, మేము మా ఇంటి ఆవరణలో క్రికెట్ ఆడేటపుడు మా అమ్మాయిలు కొన్నిసార్లు వారి నాన్నలా, మరి కొన్ని సార్లు ఆరోన్ ఫించ్ లా అవ్వాలనుకుంటారు. కాని నా మధ్య బిడ్డ మాత్రం విరాట్ కోహ్లీలా కావాలని కోరుకుంటుంది. కుమార్తెలు ఇంట్లో తండ్రి డేవిడ్‌తో ఆడుతున్నప్పుడు వారి పోటీతత్వ స్ఫూర్తి గురించి కూడా కాండిస్ మాట్లాడారు.

పిల్లలకు వార్నర్ బౌన్సర్లు వేస్తాడు. అయితే వారు ఎప్పుడూ ఫోర్, లేదా సిక్సర్ మాత్రమే కావాలనుకుంటారు. నాన్నా బౌన్సర్లు లేదా స్పిన్ వేయకండి అని అంటుంటారని కాండిస్ తెలిపారు.ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరగబోయే సిరీస్‌లో వార్నర్, కోహ్లీ ఒకరిపై ఒకరు తలపడతారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox