Breaking News

ఇప్పటికి ధోనియే బెస్ట్‌ ఫినిషర్‌.. డేవిడ్ మిల్లర్

15 th Sep 2020, UTC

దుబాయ్‌ :రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు డేవిడ్ మిల్లర్ టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోని పై ప్రశంసలు కురిపించాడు. ఒక మీడియా చానెల్‌తో మిల్లర్ మాట్లాడుతూ ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటికి ధోనియే బెస్ట్‌ ఫినిషర్‌ అని పేర్కొన్నాడు. గ్రౌండ్‌లో ఆయన ప్రదర్శించే నైపుణ్యాలు క్రికెటర్లందరికి ఆదర్శమని, ఎటువంటి పరిస్థితినైనా తన అధీనంలోకి తెచ్చుకోవడం ఆయనకే సాధ్యమని అన్నారు. ఐపీఎల్‌ 2020లో ఆయన మెరుపులను ధోని అభిమానులు, క్రికెట్‌ను ఇష్టపడే వారు చూడవచ్చని మిల్లర్ అన్నాడు. 
 
ఎంత ఒత్తిడి ఉన్నాప్రశాంతంగా ఎదుర్కొనే తీరు ధోనిని దిగ్గజ క్రికెటర్ల జాబితాలో చేర్చిందని అన్నాడు. ఒత్తిడి సందర్భాల్లో ఆయన ప్రదర్శించే నైపుణ్యాలు తనకు చాలా ఇష్టమని తెలిపాడు. గత ఐపీఎల్‌లో  కింగ్స్‌ లెవన్‌ పంజాబ్ తరపున ఆడిన మిల్లర్ ప్రస్తుత ఐపీఎల్‌2020లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరపున బరిలో దిగుతున్నాడు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox