Breaking News

సన్ రైజర్స్ పై సీఎస్ కే విజయం

01 st Oct 2021, UTC
సన్ రైజర్స్ పై సీఎస్ కే విజయం

 ఐపీఎల్‌-2021లో షార్జాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించి  చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.  ఈ మ్యాచ్ లో చెన్నై  ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. వృద్ధిమాన్‌ సాహా 44 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సీఎస్‌కే బౌలర్లలో హాజిల్‌వుడ్‌ 3, బ్రావో 2, శార్దూల్‌, జడేజా చెరో వికెట్‌ తీశారు.

135 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సీఎస్‌కే 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు రుతురాజ్‌ (45), డుప్లెసిస్‌(41) పరుగులు చేయగా అంబటి రాయుడు(17), ధోని(14)  పరుగులు చేసారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో జాసన్‌ హోల్డర్‌ మూడు వికెట్లు తీయగా.. రషీద్‌ ఖాన్‌ 1 వికెట్‌ తీశాడు.

 ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో సిద్దార్థ్‌ కౌల్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ కొట్టి  చెన్నై విజయాన్ని ఖరారు చేశాడు. ఈ మ్యాచ్‌ సందర్భంగా ధోని అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో చెన్నై వికెట్‌ కీపర్‌గా 100 క్యాచ్‌లు అందుకున్న ఘనత సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్‌ ఆటగాడు వృద్దిమాన్‌ సాహా క్యాచ్‌ అందుకోవడం ద్వారా  అతను ఈ ఘనత  సాధించాడు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox