Breaking News

ఒలింపిక్స్ లో క్రికెట్ ని కూడా చేర్చాలి..!

14 th Nov 2020, UTC

క్రికెట్ కు ప్రపంచం లో ఎంత ఫాలోయింగ్ ఉందొ తెలిసిందే. అంతటి ప్రజాదరణను చూరగొన్న క్రికెట్ ను అతిపెద్ద క్రీడా సంబరం అయిన ఒలింపిక్స్ లో స్థానం కల్పించాలని భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఒలింపిక్స్ లో క్రికెట్ ఉండాలన్న వాదనకు తానూ మద్దతు ఇస్తానని ఇటీవల రాహుల్ ద్రావిడ్ పేర్కొన్నారు. ఒలింపిక్స్ లో క్రికెట్ టీ20 ఫార్మాట్  ను ప్రవేశపెడితే ఎక్కువ ఆదరణను చూరగొంటుందని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ప్రపంచం లో దాదాపు 75 దేశాలు టీ20 ఫార్మాట్ క్రికెట్ ను ఆడుతున్నాయన్నారు.

ఒలింపిక్స్ లో క్రికెట్ ను ప్రవేశపెడితే మరింత ప్రాచుర్యం పొందుతున్నారు. అయితే, క్రికెట్ ఆట కు మెరుగైన సదుపాయాలను, ఏర్పాట్లను చేయాల్సి ఉందన్నారు. ఈ సందర్భం గా ఐపీఎల్ గురించి కూడా ప్రస్తావించారు. ఐపీఎల్ అంతగా ఆకట్టుకోవడానికి కారణం పిచ్ ల నాణ్యత అని పేర్కొన్నారు. ఒలింపిక్స్ లో కూడా ఇలాంటి ఏర్పాట్లు చేయగలిగితే క్రికెట్ కు ఎందుకు ఆదరణ లభించదని ఆయన ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా క్రికెట్ ను ఒలింపిక్స్ లోకి తీసుకురావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. క్రికెట్ ను ఒలింపిక్ క్రీడా గా చేయడానికి గతం లో కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. 2018లో ఐసీసీ సర్వే నిర్వహించగా, 87 శాతం మంది ఒలింపిక్స్ లో క్రికెట్ చేర్చాలని తమ అభిప్రాయాలూ వ్యక్తం చేసారు.మరిన్ని క్రీడా వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox