Prime9

Shami Death Threat: షమీని చంపుతామని బెదిరింపులు

Shami Death Threat: టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీని చంపుతామంటూ బెదిరింపు మొయిల్ వచ్చింది. దీంతో అతని తమ్ముడు హసీబ్ ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహా జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు FIR నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేయిల్ పంపిన వ్యక్తి రాజ్ పుత్ సిందార్ గా పేర్కొన్నాడు హసీబ్. కోటిరూపాయలను డిమాండ్ చేశాడని లేదంటే షమీని చంపేస్తానని మెయిల్ చేశాడని సూనర్ డెంట్ ఆఫ్ పోలీస్ కుతెలిపాడు హసీబ్.

 

 

కేసు నమోదు చేశారు పోలీసులు. ఇండియన్ పీనల్ కోడ్ (BNS), 2023 సెక్షన్ 308(4), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సవరణ) చట్టం, 2008 సెక్షన్ 66d మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సవరణ) చట్టం, 2008 సెక్షన్ 66e సెక్షన్ల కింద FIR నమోదు చేయబడింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

Indian cricketer shami

Indian cricketer shami

 

2025 IPLలో షమీ హైదరాబాద్ తరపున బరిలోకి దిగాడు. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచుల్లో షమీ 56.17సగటుతో ఆరు వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు భారత్ తరపున ఆడిన చాంపియన్స్ ట్రోఫీ లో అద్భుతంగా రాణించాడు. దుబాయ్ లో జరిగిన ఐదు మ్యాచ్ లలో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు.

 

 

గతనెలలో గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు
గతనెలలో గౌతమ్ గంభీర్ కు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ సెట్రల్ డిసిపి వి.హర్ష వర్ధన్ మాట్లాడుతూ గౌతమ్ గంభీర్ ఇప్పటికే ఢిల్లీ పోలీసుల రక్షణలో ఉన్నాడని తెలిపారు.

 

 

జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడిలో 26మంది మరణించిన తర్వాత గంభీర్ కు బెదింపు మెయిల్ వచ్చింది. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

 

Exit mobile version
Skip to toolbar