Breaking News

ఏడుగురు బ్యాడ్మింటన్ క్రీడాకారులకు కొవిడ్ ..

13 th Jan 2022, UTC

Badminton players :యోనెక్స్-సన్‌రైజ్ ఇండియా ఓపెన్ 2022 పోటీల్లో పాల్గొనే ఏడుగురు బ్యాడ్మింటన్ క్రీడాకారులు కరోనా వైరస్‌ బారిన పడ్డారు.మాజీ ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌తో సహా ఏడుగురు వైరస్‌ బారినపడినట్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ (బీడబ్ల్యూఎఫ్‌) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.  కరోనా వచ్చిన వారిలో కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొనప్ప, రితికా రాహుల్ థ్కర్, ట్రీసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ అమన్ సింగ్, ఖుషీ గుప్తాలు ఉన్నారు. క్రీడాకారులకు కొవిడ్-19 పాజిటివ్ అనంతరం ఇండియా ఓపెన్ 2022 పోటీల నుంచి ఏడుగురు ఆటగాళ్లను ఉపసంహరించుకున్నట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ధృవీకరించింది. ఈ క్రమంలోనే వైరస్‌ సోకిన వారికి బదులుగా వేరేవారిని తీసుకొనే ప్రసక్తి లేదని, దీంతో వారి ప్రత్యర్థులను నేరుగా తదుపరి రౌండ్లకు ప్రమోట్‌ చేస్తామని బీడబ్ల్యూఎఫ్‌ పేర్కొంది. 

 ఏడుగురు ఆటగాళ్లతో సన్నిహిత సంబంధాలున్న వారిని కూడా టోర్నమెంట్ నుంచి ఉపసంహరించుకున్నట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ తెలిపింది.బీడబ్ల్యూఎఫ్‌,బీడబ్ల్యూఐ మార్గదర్శకాల ప్రకారం క్రీడల పోటీల్లో పాల్గొనే వారందరికీ ఆరోగ్య భద్రతను నిర్ధారించడానికి టెస్టింగ్ ప్రోటోకాల్‌లు అమలు చేస్తూన్నామన్నారు.అంతకుముందు సాయి ప్రణీత్‌కు సైతం కరోనా పాజిటివ్‌గా తేలడంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మరోవైపు ఇంగ్లాండ్‌కు చెందిన ఇద్దరు క్రీడాకారులు సైతం గతంలో వైరస్‌ బారినపడటంతో ఇంగ్లాండ్‌ జట్టు ఈ టోర్నీ నుంచి తప్పుకొంది. దీంతో ఇప్పుడు టోర్నీ నిర్వహణపై సందేహాలువ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఏఐ ఏం చేయనుందనేది ఆసక్తిగా మారింది. టోర్నీని రద్దు చేస్తారా లేక అలాగే కొనసాగిస్తారా తెలియాల్సి ఉంది.  

మరిన్ని క్రీడా వర్తాలు చదవండి 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox