Site icon Prime9

South Africa vs New Zealand: దక్షిణాఫ్రికాతో సెమిస్.. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

Champions Trophy Semi-final 2 South Africa vs New Zealand: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా సెమీస్ 2లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. లాహోర్ వేదికగా మధ్యాహ్నం 2.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలుత న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచింది. ఈ మేరకు ఆ జట్టు కెప్టెన్ శాంట్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య ఇప్పటివరకు జరిగిన వన్డే మ్యాచ్‌లలో 42 మ్యాచ్‌లు సఫారి జట్టు గెలవగా.. కివీస్ 26 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో 5 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. కాగా, గత ఇరు జట్ల మధ్య జరిగిన 5 మ్యాచ్‌లను పరిశీలిస్తే.. 3 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలుపొందింది.

ఇరు జట్ల బలాలను పరిశీలిస్తే.. న్యూజిలాండ్ బ్యాటర్లలో శాంట్నర్, ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, హెన్రీ మంచి ఫామ్‌లో ఉండగా.. దక్షిణాఫ్రికా జట్టులో వాండర్ డసెన్, మార్ క్రమ్ రబాడ, కేశవ్ మహరాజ్ కీలకంగా ఆడుతున్నారు.

న్యూజిలాండ్ జట్టు:
విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లేథమ్(వికెట్ కీపర్), గ్లెవ్ ఫిలిప్స్, మిచెల్ బ్రేస్ వెల్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), మ్యాట్ హెన్రీ, కేల్ జేమీసన్, విలియమ్ ఓరేర్కీ.

దక్షిణాఫ్రికా జట్టు:
రైన్ రికెల్ టన్, టెంబా బవుమా(కెప్టెన్), రస్సీ వాన్‌డర్ డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఐదెన్ మార్ క్రమ్, వాన్ ముల్డర్, మార్కో యాన్సెస్, కేశవ్ మహరాజ్, రబాడ, లుంగి ఎంగిడి.

Exit mobile version
Skip to toolbar