Breaking News

మాజీ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ బోరిస్ బెకర్ కు రెండున్నరేళ్ల జైలుశిక్ష

30 th Apr 2022, UTC

London: 6 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ బోరిస్ బెకర్ లక్షల పౌండ్ల ఆస్తులను దాచిపెట్టి, దివాలా తీసినట్లు ప్రకటించినందుకు బ్రిటన్ కోర్టు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. బ్రిటన్ దివాలా చట్టం కింద బెకర్ ఈ నెల ప్రారంభంలో దోషిగా నిర్ధారించబడ్డాడు. ఇందులో దివాలా విచారణ తర్వాత ముఖ్యమైన ఆస్తులను బహిర్గతం చేయడంలో విఫలం చేయడం, దాచడం మరియు తొలగించడం వంటివి ఉన్నాయి.

54 ఏళ్ల  బోరిస్ బెకర్356,000 యూరోలను తొమ్మిది మందికి బదిలీ చేసినందుకు దోషిగా తేల్చారు. ఇందులో అతని మాజీ భార్య బార్బరా మరియు అతని విడిపోయిన భార్య షార్లీ "లిల్లీ" బెకర్ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. అతను జర్మనీలో ఆస్తిని ప్రకటించకపోవడం, మరియు టెక్ సంస్థలో వాటాలను దాచిపెట్టడం వంటి అభియోగాలు కూడ వున్నాయి. లండన్‌లోని సౌత్‌వార్క్ క్రౌన్ కోర్ట్‌లో అతనికి రెండు సంవత్సరాల ఆరు నెలల జైలు శిక్ష విధించినప్పుడు న్యాయమూర్తి డెబోరా టేలర్ అతనితో మాట్లాడుతూ మీ అపరాధానికి మీరు పశ్చాత్తాపం లేదా అంగీకారం చూపకపోవడం గమనార్హం అంటూ వ్యాఖ్యానించారు. అయితే బోరిస్ బెకర్ తన పై వున్న ఆరోపణలను తిరస్కరించాడు. తన 50 మిలియన్ డాలర్ల సంపాదన ఖరీదైన విడాకుల చెల్లింపులకు, అప్పులు తీర్చడానికి సరిపోయిందన్నాడు. 

బోరిస్ బెకర్ 1985లో 17 ఏళ్ల వయస్సులో వింబుల్డన్ గెలిచిన మొదటి అన్‌సీడెడ్ ఆటగాడిగా నిలిచాడు. 3 సార్లు వింబుల్డన్ ఛాంపియన్ అయిన అతను 2012 నుండి బ్రిటన్‌లో నివసిస్తున్నాడు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox