Breaking News

తండ్రి అయిన అంబటి రాయుడు..!

13 th Jul 2020, UTC
తండ్రి అయిన అంబటి రాయుడు..!
భారత టీం కు ఆడే క్రికెటర్ అంబటి రాయుడు అందరికి సుపరిచితమే.. అంబటి  రాయుడు సౌత్ ఇండియన్ వాసి.. రాయుడు భార్య చెన్నుపల్లి విద్యా ఆదివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నిన్న అంబటి రాయుడు తాను తండ్రి ని అయినట్లు ట్విట్టర్ మాధ్యమం లో అభిమానులతో పంచుకున్నాడు..  రాయుడు ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఈ విషయాన్ని పోస్టు చేసింది. 
 
         ట్విట్టర్ లో రాయుడు షేర్ చేసుకున్న ఫోటో ను చెన్నై సూపర్ కింగ్స్ కూడా పెట్టింది.. ఈ ఫోటో లో.. అంబటి రాయుడు, చెన్నుపల్లి విద్య, వారి కుమార్తె ఉన్నారు. పలువురు ఆటగాళ్లు రాయుడుకు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా కూడా తన సామాజిక మాధ్యమాల్లో అంబటి రాయుడుకు బెస్ట్ విషెస్ చెప్పాడు. మరో వైపు అభిమానులు కూడా పెద్ద ఎత్తున విషెస్ చెబుతూ తమ అభిమానాన్ని చాటు కుంటున్నారు.
 
          అంబటి రాయుడు, విద్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. 2009 లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.. దాదాపు పదకొండు సంవత్సరాల తరువాత అంబటి రాయుడు తండ్రి అయ్యాడు.. అంబటి రాయుడు భారత్ తరపున 55 వన్డేలు ఆడాడు, ఆరు టీ20 మ్యాచ్ లు ఆడాడు. అంబటి రాయుడు చివరిసారిగా మార్చి 2019న భారతజట్టు తరపున ఆడాడు. అయితే గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ కోసం తనను ఎంపిక చేయకపోవడంతో నిరాశకు గురైన రాయుడు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కానీ తర్వాత దానిని వెనక్కి తీసుకున్న సంగతి విదితమే.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox