Breaking News

క్యా బాత్‌ హై రవిశాస్త్రి.. రణ్ వీర్ సింగ్..!

03 rd Jun 2020, UTC
క్యా బాత్‌ హై రవిశాస్త్రి.. రణ్ వీర్ సింగ్..!

భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే రవిశాస్త్రి టీమిండియా బ్లేజర్‌ ధరించి ఉన్న ఓ పాత ఫోటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ప్రతిభావంతులు ఎంతమంది ఉన్నా రాజీ పడకుండా కష్టపడేవారే విజయం సాధిస్తారనే అర్థంలో ఆ ఫోటోకు క్యాప్షన్‌ను జతచేశాడు. కాగా, బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ రవిశాస్త్రి పోస్ట్‌పై సందిస్తూ ‘క్యా బాత్‌ హై’ అంటూ కామెంట్‌ చేశాడు.

బాలీవుడ్‌ హీరో కామెంట్‌ చేయడంతో రవిశాస్త్రి చేసిన పోస్ట్‌ మరింత వైరల్‌ అయింది. రణ్‌వీర్‌తో పాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులు రవిశాస్త్రి పోస్ట్‌ను లైక్‌ చేస్తున్నారు.  కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు రవిశాస్త్రి.

అయితే ఈ ఖాళీ సమయంలో అప్పడప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పలు ఆసక్తికర, ఫన్నీ విషయాలను అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox