Breaking News

షాహిద్ అఫ్రిదికి కరోనా సోకింది..!

13 th Jun 2020, UTC
షాహిద్ అఫ్రిదికి  కరోనా సోకింది..!
పాకిస్థాన్ మాజీ  క్రికెట్ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా అఫ్రిదీనే సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలియజేశాడు. గత గురువారం నుంచి తనకి ఆరోగ్యం బాగోలేదని వెల్లడించిన అఫ్రిది.. పరీక్షలు చేయించుకోగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని చెప్పుకొచ్చాడు. . . 'గురువారం నుంచి నేను కొంచెం అస్వస్థతకు లోనయ్యా. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోగా దురదృష్టవశాత్తు పాజిటీవ్ అని తేలింది. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. మీరంతా ఇంట్లోనే భద్రంగా ఉండండి' అని అఫ్రిది ట్విట్ చేశాడు.

కరోనా సోకిన పాక్‌ క్రికెటర్లలో షాహిద్ అఫ్రిది మూడోవాడు. ఆ జట్టు మాజీ ఓపెనర్ తఫీక్ ఉమర్‌, ఫస్ట్ క్లాస్ మాజీ క్రికెటర్ జఫార్ సర్ఫరాజ్ కూడా ఈ మహమ్మారి భారిన పడ్డారు. 14 రోజుల ఐసోలేషన్ తర్వాత ఈ ఇద్దరు కోలుకున్నారు. జూన్ మొదటి వారంలోనే తఫీక్‌కు పరీక్షలు నిర్వహింగా నెగటీవ్ వచ్చింది. స్కాట్లాండ్ లో మాజిద్ హక్, సౌతాఫ్రికాలో సొలో ఎంక్వెనీలు కూడా కరోనా బారిన పడ్డారు. ఇతర క్రికెటర్లు కూడా కొవిడ్-19 బాధితులయ్యారు. క్రికెట్‌ను పునురద్దరించే క్రమంలో మాజీ ఆటగాళ్లు మహమ్మారి బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా వైరస్‌ కారణంగా పాకిస్థాన్‌లో లాక్‌డౌన్ విధించగా.. చాలా మంది పేదలకి అఫ్రిది తన ఫౌండేషన్ ద్వారా ఆహారం, నిత్యావసరాల్ని అందించాడు. ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో సైతం పర్యటించిన అఫ్రిది.. అక్కడ భారత ప్రధాని నరేంద్ర మోడీపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాడు. ప్రపంచమంతా కరోనా వైరస్‌పై పోరాడుతోంది. కానీ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ మనసులో కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన ఆలోచనలు ఉన్నాయి. పాక్ సైన్యం ఏడు లక్షలుకాగా.. ఒక్క కాశ్మీర్‌లోనే భారత ప్రభుత్వం అంతకంటే ఎక్కువ మంది సైన్యాన్ని మొహరించింది. కానీ.. కాశ్మీర్ పౌరులు పాక్‌ సైన్యానికే సపోర్ట్ చేస్తున్నారు అని విద్వేష వ్యాఖ్యలు చేశాడు.

అయితే ఆఫ్రిది వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ గంభీర్ తో సహా పలువురు తప్పు పట్టారు. 1971లో ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోవాలని హెచ్చరించారు. భారత్, పాక్ ల మధ్య జరిగిన యుద్దంలో పాక్ చిత్తుగా ఓడిపోయి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా ఆవిర్బవించిన విషయాన్ని ఇన్ డైరక్ట్ గా తెలిపారు. అంతేకాదు...పీవోకే పై పాక్ చేస్తున్న అసత్యప్రచారం ప్రపంచదేశాలకు అన్నింటికీ తెలిసిందేనని భారత్ బరిలో దిగితే  దీనికి ఎప్పడో ముగింపు పలికే దని కూడ వారు అన్నారు.

1996లో పాకిస్థాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన షాహిద్ అఫ్రిది.. 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20 మ్యాచ్‌లాడాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టుని కెప్టెన్‌గా నడిపించిన అఫ్రిది.. విధ్వంసక ఇన్నింగ్స్‌లకి పెట్టింది పేరు. వన్డేల్లో అత్యంత చిన్న వయసులోనే సెంచరీ నమోదు చేసిన రికార్డ్ అఫ్రిది పేరిటే ఉంది. 16 ఏళ్ల వయసులో.. అదీ అంతర్జాతీయ క్రికెట్‌‌లోకి అరంగేట్రం చేసిన రెండో మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ని అఫ్రిది సాధించాడు. 1996లో శ్రీలంకతో జరిగిన ఆ వన్డే మ్యాచ్‌లో అఫ్రిది కేవలం 37 బంతుల్లోనే సెంచరీ  చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు.
 
  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox