Breaking News

కరణం మల్లీశ్వరి బయో పిక్ ను తెరకెక్కిస్తున్న కోన..!

01 st Jun 2020, UTC
కరణం మల్లీశ్వరి బయో పిక్ ను తెరకెక్కిస్తున్న కోన..!

2000 ఒలింపిక్స్ లో మల్లీశ్వరి భారత ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింపజేసిన సంగతి తెలిసిందే. 2000 ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో విన్నర్ గా నిలిచిన తొలి భారతీయ మహిళా కరణం మల్లీశ్వరి అందరికి తెలిసిన వ్యక్తే. ఆమె జీవిత చరిత్ర ఆధారం గా ఓ బయో పిక్ ను తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత కోన వెంకట్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. నేడు కరణం మల్లీశ్వరి పుట్టిన రోజు.. ఈ సందర్భం గా కోన వెంకట్ మరో నిర్మాత ఎంవీవీ సత్యనారాయణతో కలిసి ఎంవీవీ సినిమా, కేఎఫ్సీ (కోనా ఫిల్మ్ కార్పొరేషన్) ఈ సినిమాను నిర్మించనున్నట్టు కోన వెంకట్ తెలిపారు. ఇది పాన్ ఇండియా చిత్రమని ఆయన స్పష్టం చేశారు. సినిమాలో కరణం మల్లీశ్వరి పాత్రను చేసే హీరోయిన్ ఎవరన్న విషయమై ఆయన ఎటువంటి స్పష్టతనూ ఇవ్వలేదు.   కాగా... సంజన రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox