Breaking News

మరోసారి వార్నర్ మైండ్ బ్లాక్!

01 st Jun 2020, UTC
మరోసారి వార్నర్ మైండ్ బ్లాక్!

తెలుగు సినిమా డైలాగులు చెబుతూ, తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్‌లేస్తూ ఆకట్టుకుంటున్నాడు ఆస్ట్రేలియన్ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యుడు డేవిడ్ వార్నర్. ‘అల వైకుంఠపురములో..’ చిత్రంలోని ‘రాములో.. రాముల..’, ‘బుట్టబొమ్మ’ పాటలకు వార్నర్ గతంలో చిందులేశాడు.

తాజాగా సూపర్‌స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘మైండ్‌బ్లాక్’ పాటకు తన భార్యతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. అయితే మరోసారి ‘మైండ్‌బ్లాక్’ పాటపై వార్నర్ తన భార్య క్యాండీస్‌తో కలిసి చిందులు వేసి.. సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ తన భార్య కాండిస్‌ మాదిరిగా తాను డ్యాన్స్‌ చేయలేకపోయానని వార్నర్‌ చెప్పుకొచ్చాడు. మైండ్‌ బ్లాక్‌ పార్ట్‌-2 లో ఆమె డ్యాన్స్‌ ఇరగదీసిందని మెచ్చుకున్నాడు. దీనికి మూడో పార్ట్‌ కూడా ఉంటుందని వార్నర్‌ చెప్పుకొచ్చాడు. ‘ డియర్‌.. నీ ముందు తేలిపోయా.. నేను చెత్తగా డ్యాన్స్‌ చేశా. నువ్వు మాత్రం స్టెప్పులతో ఇరదీశావ్‌. మరో పార్ట్‌తో ముందుకొస్తాం’ అని వార్నర్‌ తెలిపాడు.మూడో పార్ట్ కావాలా అంటూ వార్నర్.. మహేశ్ బాబు, రష్మికా మందన్నలను ట్యాగ్ చేశాడు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox