Breaking News

సన్‌రైజర్స్‌తో ఆడాకే నాలో మార్పు వచ్చింది... పేసర్ భువనేశ్వర్ కుమార్

27 th Jun 2020, UTC

సన్‌రైజర్స్‌తో ఆడటం మొదలు పెట్టాక తనలో మార్పు వచ్చిందని పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అన్నాడు. ఐపీఎల్‌ లోసన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయాల్లో పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కీలకపాత్ర పోషించాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో, చివర్లో కీలక వికెట్లు తీసి జట్టుకు విజయాలు అందించాడు.

ఐపీఎల్ ప్రదర్శనే తనలో ఆత్మవిశ్వాసం పెంచిందని, తీవ్ర ఒత్తిడి సమయంలో ఎలా బౌలింగ్‌ చేయాలో కూడా నేర్చుకున్నానని భువనేశ్వర్‌ వ్యాఖ్యానించాడు. ‘మొదటి నుంచి కూడా యార్కర్లు నా బలం. వాటిని బాగానే ఉపయోగించినా ఆ తర్వాత పట్టు చేజార్చుకునేవాడిని.

ప్రారంభ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయాల్సినప్పుడు, డెత్‌ ఓవర్లలో పరుగులు నిరోధించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేనే ఎక్కువగా బౌలింగ్‌ చేశాను. దాని వల్ల నాకు ఎంతో మేలు జరిగింది. తీవ్రమైన ఒత్తిడిలోనూ మెరుగ్గా బౌలింగ్‌ ఎలా చేయాలో నేర్చుకోగలిగాను’ అని భువనేశ్వర్‌ చెప్పాడు.

2014 నుంచి సన్‌రైజర్స్‌ జట్టు తరఫున ఆడుతున్న భువనేశ్వర్ 6 సీజన్లలో 86 మ్యాచ్‌లు ఆడి 109 వికెట్లు పడగొట్టాడు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox