Patancheru Chemical Unit: సంగారెడ్డిలో భారీ పేలుడు.. 10 మంది కార్మికులు మృతి!

Cast & Crew
- (Hero)
- (Heroine)
- (Cast)
- (Director)
- (Producer)
- (Music)
- (Cinematography)
Chemical Factory Blast in Sangareddy: సంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు చోటుచేసుకోగా.. 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. అయితే పరిశ్రమలో ఒక్కసారిగా పేలుడు శబ్దం రావడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. తీవ్రగాయాలైన వారిని పటాన్‌చెరులోని ఓ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. కాగా, సీగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించడంతో కంపెనీ దగ్గరకు అందులో పనిచేస్తున్న కార్మికుల కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఇదిలా ఉండగా, పరిశ్రమలో రియాక్టర్ పేలి మంటలు ఎగిసిపడున్నాయి. మంటల్లో కార్మికులు చిక్కుకున్నారు. 20 మందికి పైగా కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. భారీగా అంబులెన్స్‌లు, 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు.