Breaking News

నిండుతున్న చెరువులు, పండుతున్న పంటలు వాస్తవం కాదా :మంత్రి హరీష్ రావు

02 nd Jun 2020, UTC

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రిహరీశ్‌రావు మండిపడ్డారు. గాంధీభవన్‌లో కూర్చుంటే కాళేశ్వరం నీళ్లు కనపడవు. నిండుతున్న చెరువులు, పండుతున్న పంటలు వాస్తవం కాదా?, రైతులను కలిసి నీళ్లొచ్చాయో? రాలేదో ? ఒక్కసారి చూసి మాట్లాడితే మంచిది. కాళేశ్వరం ఫలితమే సూర్యాపేటకు, వరంగల్‌కు నీళ్లు. గోదావరి ఉప్పెనలాగా పంట కాలువలు, పిల్ల కాలువలు, మైనర్ కెనాల్స్, డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్‌లో అద్భుతంగా ప్రవహిస్తోంది. లక్షలాది మంది ప్రతిరోజు చూస్తున్నారు.

 పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తున్నాయి. ఇది మీకు తెలియదా?, లేక తెలిసి ఉద్దేశపూర్వకంగా మాట్లాడ్తున్నారా ?, పారుతున్న నీళ్లు వాస్తవం కాదా?, నిండుతున్న చెరువులు వాస్తవం కాదా?,  పండుతున్న పంట వాస్తవం కాదా ?, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాస్తవాలు మాట్లాడాలి. అప్పుడే విశ్వసనీయత పెరుగుతుంది.

అసెంబ్లీలో చెప్పిన మేరకు రుణమాఫీ అమలు జరుగుతోంది.1200 కోట్లు ఇప్పటికే ఆర్థికశాఖ విడుదల చేసింది. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నది మీకు కనిపించడం లేదా?, తెలంగాణ ఆవిర్భావ ఫలితం ఈ రోజు దుబ్బాకకు అందుతోంది.. అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox