Breaking News

స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీలు వైసీపీ కైవసం

27 th Nov 2021, UTC

స్థానిక సంస్థల కోటాలో శాసనమండలిలోని 11 స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో మిగిలారు. పోటీ లేకపోవడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను రిటర్నింగ్‌ అధికారులు లాంఛనంగా జారీ చేయనున్నారు.  

ఎమ్మెల్సీలుగా ఎన్నికయిన వారిలో             ఇందుకూరు రఘురాజు(విజయనగరం), వరుదు కళ్యాణి, వంశీకృష్ణ యాదవ్‌ (విశాఖపట్నం),   అనంత ఉదయభాస్కర్‌  (తూర్పుగోదావరి),  తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్‌  (కృష్ణా),     ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు(గుంటూరు), తూమాటి మాధవరావు( ప్రకాశం),   కృష్ణ రాఘవ జయేంద్ర భరత్‌ (చిత్తూరు),       వై.శివరామిరెడ్డి ( అనంతపురం) వున్నారు.     58 మంది సభ్యులు ఉన్న ఏపీ  శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ బలం 20 నుంచి 31కు పెరగనుంది. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox