Breaking News

గ్రేటర్ ఎస్కేప్ జనసేన పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

21 st Nov 2020, UTC

జనసేనాని పవన్ కళ్యాణ్ కు రాజకీయాలపై పూర్తి అవగాహనా కుదరలేదని చాలామంది భావిస్తూనే ఉంటారు. ఆయనకు ఉన్న ఆవేశం, రాజకీయాల్లో పనికిరాదని చెబుతుంటారు. ఆయన నిర్ణయాలు కూడా చాలామందికి అర్ధం కావు. ఎపుడు ఎవరికీ మద్దతు ఇస్తారో తెలియదు. తొలుత టీడీపీకి మద్దతిచ్చి నష్టపోయారు. తాజాగా, బీజేపీకి కూడా మద్దతిస్తున్నారు. అయితే, ఏపీ బీజేపీ తో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఇరు పక్షాలకు పొత్తు కుదరలేదని పలువురు భావిస్తున్నారు. దానికి కారణం తిరుపతి ఎన్నికల నేపధ్యం లో, జనసేనాని ని సంప్రదించకుండా బీజేపీ నేతలు చర్చలు జరుపుకోవడమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

ఈ క్రమంలో గ్రేటర్ ఎన్నికలలో తాము కూడా పోటీ చేయబోతున్నట్లు సడన్ ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అయితే, ఈ విషయం ముందుగా బీజేపీతో చర్చించారో లేదో చాల మందికి క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే, బీజేపీకి జనసేనకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. తెలంగాణ బీజేపీ తో కూడా పొత్తు ఉంటుందని, చర్చలు జరుపుతామని జనసేన ప్రకటన చేసేసింది. కానీ బండి సంజయ్ మాత్రం అలాంటిదేమి లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పుకొచ్చారు. దీనితో, ఎటు పాలుపోని పరిస్థితి జనసేనది. ఈ టైం లో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి లు పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపారు. ఆ తరువాత తెలంగాణ బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఒకవేళ, బీజేపీతో పొత్తు లేకుండా పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పటికీ, 150 స్థానాల్లో ఒక్క స్థానం అయినా గెలుపొందే అవకాశం లేదు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ ఏపీలోనే ఆక్టివ్ గా ఉన్నారు. తెలంగాణలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పాలు పంచుకున్నది చాలా తక్కువ. 

ఈ క్రమంలో పొత్తు లేకుండా పాల్గొంటే, పవన్ పోటీ చేసి ఉపయోగం ఉండదు. అందుకే ఈ సారికి పవన్ కూడా తగ్గి వెనక్కి వెళ్లి ఉండొచ్చు. కానీ, గ్రేటర్ ఎన్నికల నుంచి తప్పుకోవడం వలన కొంత నెగటివ్ ఇంపాక్ట్ పార్టీ పై పడే అవకాశం ఉంది. జనసేన ఆవిర్భావం నుంచి పటిష్టమైన నాయకత్వం ఆ పార్టీకి కరువైందని ప్రస్ఫూటంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కి బలగం ఉంది, నిజాయితీ ఉంది, ఆవేశం ఉంది. కానీ సరైన దిశలో ఆయన ప్రయాణం లేదు. దీనితో, ఆయన ప్రజల్లో నమ్మకాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. దానికి తోడు, మాట మార్చడాలు, పటిష్టంగా ఓ నిర్ణయం తీస్కోలేకపోవడాలు వంటి వాటివలన ఆయన ప్రజలకు మరింత దూరం అవుతున్నారు. అసలు గ్రేటర్ ఎన్నికలలోకి ఆయన రాకపోయినా, మర్యాద దక్కేది. ఇలా వచ్చి, తప్పుకుంటున్నట్లు ప్రకటించడం వలన, ఇంకా బీజేపీకి మద్దతు ఇస్తున్నాం అని తెర వెనకే ఉండిపోవడం వలన ఆ ప్రభావం చాలావరకు పార్టీ పై పడే ప్రమాదం ఉంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox