Breaking News

ఇలాంటి బూతులు మేం ఎప్పుడూ మాట్లాడలేదు. . సీఎం జగన్

20 th Oct 2021, UTC

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమపాలన చూసి టీడీపీ ఓర్వేలకపోతోందని సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రతిపక్షం ఎలా తయారయిందో ప్రజలు చూస్తున్నారు.బూతులు తిడుతూ ప్రతిపక్ష నేతలు రాజకీయాలు చేస్తున్నారు. ఎవరూ మాట్లాడని బూతులను ప్రతిపక్షం మాట్లాడుతోంది. గతంలో మేం కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. ఇలాంటి బూతులు మేం ఎప్పుడూ మాట్లాడలేదు. 

 టీవీలో ఇటువంటి మాటలను చూసిన వైసీపీ అభిమానులు ఆవేశంతో దాడులు చేసివుండవచ్చని జగన్ అన్నారు. టీడీపీకి తోడుగా  ఒక వర్గం మీడియా కూడ  ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని జగన్ అన్నారు.టీడీపీ నేతలు కావాలనే వైషమ్యాలు సృష్టించి రెచ్చగొడుతున్నారు. ప్రతిమాటలోనూ, రాతలోనూ వంచన కనిపిస్తోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కూడా టీడీపీ వెనకాడదని సీఎం  జగన్ అన్నారు. 

'జగనన్న తోడు' కార్యక్రమంలో భాగంగా లబ్ధి దారుల వడ్డీ సొమ్మును బ్యాంక్‌ ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారు. బుధవారం క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి రూ.16.36 కోట్లు లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేశారు. తొలి విడత ‘జగనన్న తోడు’ కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4.5 లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు 9.05 లక్షల మందికి రూ.950 కోట్ల రుణాలను ప్రభుత్వం అందించింది. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox