Breaking News

సచివాలయం కూల్చడం ఇపుడు అవసరమా..?

07 th Jul 2020, UTC
సచివాలయం కూల్చడం ఇపుడు అవసరమా..?
సచివాలయం బీఆర్కే భవన్‌ను క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే.. అంతే కాదు..అటు వైపు ఉండే రహదారులని మూసి వేసి మరీ సచివాలయాన్ని కూల్చివేస్తున్నారు. నేడు, మంగళవారం.. సచివాలయ కూల్చివేత పనులను ప్రారంభించారు. శ్రావణ మాసం లో కొత్త సచివాలయాలని నిర్మించాలనుకుంటున్నట్లు ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొత్త సచివాలయం డిజైన్ ను ప్రభుత్వం ఖరారు చేసింది. 
 
              అయితే.. ఆఘమేఘాల మీద సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభించడం పై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఓ పక్క రాష్ట్రము లో కరోనా మహమ్మారి తీవ్రం గా ఉంది.. ప్రజలు భయబ్రాంతుల్లో ఉన్నారు.. సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం.. అర్జెంటు గా సచివాలయాన్ని కూల్చివేసే పనులు మొదలుపెట్టడం పై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజలు అల్లాడుతుంటే.. ఇంత అత్యవసరం గా సచివాలయాన్ని కూల్చి వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం మీడియాకు  ఓ ప్రకటనను విడుదల చేసారు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రజల బాధలకంటే తన మొండి పట్టుదలే ప్రాధాన్యతగా ఉందని  వీరు తమ ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా సంక్షోభంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని, రైతులకు రుణమాఫీ డబ్బులు లేవని.. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సచివాలయం అవసరమా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. 
 
               ఓ పక్క కరోనా విలయ తాండవం చేస్తుంటే.. ముఖ్యమంత్రి వైద్యం గురించి సమీక్షలు జరపకుండా చీకటిలో ఉన్నారని విమర్శించారు. ప్రజలంతా.. ముఖ్యమంత్రి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో గమనించుకుని ప్రశ్నించాలని సూచించారు. పాత సచివాలయంలో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేయమని తాము కోరామని, 10 వేల మంది రోగులకు అక్కడ వైద్య సౌకర్యాలు కల్పించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. కానీ.. ముఖ్యమంత్రి మొండి వైఖరి అవలంబిస్తున్నారని.. మొదటి నుంచి కరోనా విషయం లో తప్పుడు విధానాలను అనుసరిస్తూ వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox