Breaking News

బీజేపీ ని చూసి తెరాస భయపడుతోంది.: బండి సంజయ్

21 st Nov 2020, UTC

తెలంగాణ: హైదరాబాద్ లో జి హెచ్ ఎం సి ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడం తో, అని పార్టీల నేతలు విస్తృతం గా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపధ్యం లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యర్థి తెరాస నేతలపై విమర్శల వర్షం కురిపించారు. తెరాస పార్టీ ని బీజేపీ ని చూసి భయపడుతోందంటూ దుమ్మెత్తి పోశారు. 

శని వారం ప్రెస్ మీట్ లో బండి సంజయ్ తెరాస పార్టీ ని ఉద్దేశించి మాట్లాడారు. వరదసాయంపై తాను ఈసీకి లేఖ రాయలేదని బండి సంజయ్ స్పష్టం చేసారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసారని వివరించారు. వరద సాయం విషయమై తమకు ఎలాంటి లేఖ అందలేదని స్వయం గా ఎస్ ఈ సి చెప్పిన విషయాన్నీ గుర్తుచేశారు. ఇదంతా, తెరాస కుట్ర లో భాగమేనని స్పష్టం చేసారు. మరో వైపు, తానూ వాస్తవాలు చెబుతున్నా, తెరాస నాయకులూ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్లో చైతన్యం వస్తోందని, వారికీ ఏమి చేయాలో తెలుసనీ బండి సంజయ్ అన్నారు. తాము గెలిస్తే మాత్రం వరద సాయం కింద బాధితులకు పాతికవేలు అందిస్తామని తెలిపారు. కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు చైనా కు అనుకూలం గా ఉన్నాయని, ఇది దేశ ద్రోహం కాదా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox