Breaking News

వైరల్ అవుతున్న బాలయ్య కామన్ డీపీ..!

06 th Jun 2020, UTC
వైరల్ అవుతున్న బాలయ్య కామన్ డీపీ..!
నేడు బాలయ్య బాబు అరవైయ్యవ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా అభిమానులు తయారు చేసిన కామన్ డీపీ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు ఈ డీపీని షేర్‌ చేశారు. బాలకృష్ణ నటించిన రెండు సినిమాల్లోని లుక్‌లతో దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ కామన్ డీపీ లో శ్రీకృష్ణ దేవరాయల పాత్ర కూడా ఉంది..టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు కూడా ఈ డీపీని షేర్ చేశారు."సినీజీవితంలో ప్రేక్ష‌కుల‌ అభిమాన క‌థానాయ‌కుడిగా అల‌రిస్తూ.. శాసనసభ్యునిగా ప్రజాసేవలో.. కేన్స‌ర్ ఆస్ప‌త్రి చైర్మ‌న్‌గా సామాజిక సేవలో... విశేష సేవలందిస్తున్న నందమూరి బాలకృష్ణ గారి 60వ పుట్టినరోజు సందర్భంగా కామన్ డీపీని విడుదల చేయడం సంతోషదాయకం" అని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. 
              మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ డీపీ ని షేర్ చేస్తూ " అటు యాక్షన్ సినిమా అయినా ఇటు పౌరాణిక చిత్రం అయినా వేసిన పాత్రకి వన్నె తెచ్చే నటన. రాజకీయ నాయకుడిగా ప్రజాసేవలోనూ రియల్ హీరోగా గుర్తింపు పొందిన మా నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా కామన్ డీపీ ఆవిష్కరించడం సంతోషంగా ఉంది" అని తన ట్వీట్ లో పేర్కొన్నారు. పత్తిపాటి పుల్లారావు గారు కూడా "నటరత్న నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా కామన్ డీపీని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది" అని తన ట్వీట్ లో పేర్కొన్నారు. #NBKBirthdayCDP, #JaiBallaya హ్యాష్ ట్యాగ్‌లతో దీన్ని అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ఇదే డీపీని బ్యానర్లుగా కట్టి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి సినిమా లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox