Breaking News

తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్..!

29 th Jun 2020, UTC
తెలంగాణ హోంమంత్రికి  కరోనా పాజిటివ్..!

తెలంగాణలో  ఇప్పటికే పలు రాజకీయ నేతలు  కరోనా వైరస్‌  బారినపడిన విషయం తెలిసందే. తాజాగారాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ కూడా ఈ జాబితాలో చేరారు. హోంమంత్రికి కరోనా టెస్టులు చేయగా వైరస్‌ సోకినట్లు సోమవారం నిర్ధారణ అయింది. ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌ లకు కనోనా సోకింది.

కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న మంత్రి మూడు రోజుల క్రితం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆస్తమా ఉండటంతో ముందు జాగ్రత్తగా కుటుంబ సభ్యులు ఆయనను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు నేడు రాగా, అందులో ఆయనకు పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో హోంమంత్రికి వైద్యం అందిస్తున్నారు.

మరోవైపు పోలీసులు . హోంమంత్రితో తిరిగిన వారిని క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. అలాగే హోంమంత్రి నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటైజర్ చేస్తున్నారు. హోంమంత్రి ఆరోగ్యంపై సహచర మంత్రులు వాకబు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

తెలంగాణలో కరోనా పరిస్థితి, రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న చర్యలను క్షేత్ర స్థాయిలో అద్యయనం చేసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సోమవారం గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రిని పరిశీలించింది. కరోనా నివారణ చర్యలపై ఆరా తీసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox