Breaking News

ట్రాక్టర్ నడుపుతూ అసెంబ్లీకి వచ్చిన తేజస్వి యాదవ్

22 nd Feb 2021, UTC

పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండటం, గ్యాస్ ధర ఊహించనంతగా పెరగడంపై  ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్  నిరసన తెలిపారు. సోమవారంనాడు తన నిరసన తెలియజేస్తూ, రైతులకు సంఘీభావంగా తన నివాసం నుంచి ట్రాక్టర్‌ను నడుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు. తేజస్వికి మద్దతుగా కార్యకర్తలు పెద్దఎత్తున ఆయన వెంట కదిలారు. అనంతరం తేజస్వి మాట్లాడుతూ, ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడే మన దేశంలో రైతుల గోడు పట్టించుకోకపోవడం చాలా అన్యాయమని అన్నారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుందని అన్నారు. 

'ద్రవ్యోల్బణం అదుపు చేస్తామని చెప్పి మీరు (బీజేపీ) అధికారంలోకి వచ్చారు. కానీ ఇంధనం ధరలు, ఎల్జీజీ సిలెండర్ ధరలు చుక్కలనంటాయి' అంటూ తేజస్వి మండిపడ్డారు.ఇంధనం ధరలు చుక్కలనంటుతున్నా మౌన ప్రేక్షకుడిలా ముఖ్యమంత్రి చూస్తూ మిన్నకున్నారని అన్నారు. బీహార్‌లో రైతులు తరచు కనీస మద్దతు ధరకంటే సగానికి తక్కువగా తమ ఉత్పత్తులు అమ్ముకోక తప్పడం లేదన్నారు. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీలను (ఏపీఎంసీ‌లను) రద్దు చేయడమే ఇందుకు కారణమని ఆయన తప్పుపట్టారు. ఇందువల్ల రైతులు పొందిన లబ్ధి ఏమిటో నితీష్ చెప్పాలన్నారు. 

ఆందోళనల్లో 260 మందికి పైగా రైతులు చనిపోయారని, జవాన్లతో సమానంగా రైతులను కూడా గౌరవించాలనే 'జై జవాన్ జై కిసాన్' నినాదాన్ని పునరుద్ఘాటించడానికే తాను ఈ నిరసన చేపట్టానని చెప్పారు. రైతుల డిమాండ్లను పరిష్కరించేంత వరకూ తాము రైతులకు బాసటగా నిరసనలు చేపడుతూనే ఉంటామని, ప్రభుత్వాన్ని నిలదీస్తామని తేజస్వి అన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox