Breaking News

మా బాబాయ్ ని 151 మంది ఎదుర్కోలేకపోయారు:రామ్మోహన్ నాయుడు

12 th Jun 2020, UTC

తన బాబాయ్ అచ్చెన్నాయుడు అరెస్టుకు జగన్ సూత్రధారి అని,  ఆయనపై పగబట్టారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అచ్చెన్నాయుడిని  అధికారపార్టీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు  ఎదుర్కోలేక పోయారని చివరకు తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేసారని ఆరోపించారు.

ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలో భయాన్ని సృష్టించడానికి, ప్రశ్నించకూడదు అన్న ధోరణిలో వెళుతున్నారని విమర్శించారు.
సీఎం వైఎస్ జగన్ ప్రతాపం ఇదేనా అని  ఆయన ప్రశ్నించారు.

 ఈఎస్ ఐ మందుల కొనుగోళ్లపై  గతంలో మొదట ప్రెస్ మీట్ పెట్టిందే అచ్చెన్నాయుడని, ఆరోపణలపై అప్పట్లోనే సమాధానం ఇచ్చారన్నారు. టీడీపీ ప్రధాన గొంతుక అచ్చెన్నాయుడని, ఈ ప్రభుత్వానికి ఫ్యాక్షన్ రాజకీయాలు, విధ్వంసం చేయడం తప్ప మరొకటి లేదన్నారు. సబ్జెక్ట్ పై మాట్లాడితే.. వాళ్ల దగ్గర సమాధానం లేదన్నారు.

 కేసులపై జగన్ మోహన్ రెడ్డికి అవగాహన ఉందన్నారు. సంవత్సరం కాలంగా సుప్రీం కోర్టు మొట్టికాయలు మొత్తుతూనే ఉందన్నారు.  తప్పుడు కేసు సృష్టించి అరెస్ట్ చేశారన్నారు. కేంద్రం తరఫున ఈఎస్ఐకీ నిధులు వస్తాయని, తక్కువ ధరకే మందులు కొన్న రాష్ట్రం ఏపీ అన్నారు. అందులో ఏమైనా తప్పులు జరిగితే... సెంట్రల్ అధికారులు చూసుకుంటారని, రాష్ట్రం పరిధిలోకి రాదని.. ఏవైనా జరిగితే.. కేంద్రం ఆ నివేదకలను అప్రూవ్ చేయదని  ఆయన అన్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox