Breaking News

టీడీపీ నేత పట్టాభికి బెయిల్‌ మంజూరు..

23 rd Oct 2021, UTC
టీడీపీ నేత పట్టాభికి బెయిల్‌ మంజూరు..

టీడీపీ నేత పట్టాభికి బెయిల్‌ మంజూరైంది. ఈ రోజు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు పట్టాభికి బెయిల్ ఇచ్చింది. సెక్షన్‌ 41 ఏ నోటిసులపై పోలీసులు కింది కోర్టు సూచనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

సీఎం జగన్‌పై పరుష పదజాలం ఉపయోగించినందుకు పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్‌విత్‌ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం పట్టాభి రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.ఈ కేసులో కొమ్మారెడ్డి పట్టాభికి విజయవాడ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు నవంబర్ 2 వరకు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

పట్టాభి తరఫున న్యాయవాది శుక్రవారం హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు పట్టాభిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. అయితే, వారి అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తన ఇంటిపై చాలా సార్లు దాడి చేశారని.. పట్టాభి న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని.. ప్రభుత్వంలో వున్న లోపాలనే ప్రస్తావించానని పట్టాభి చెప్పారు.. పట్టాభికి బెయిల్ రావడంపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox