Breaking News

ఇలాంటి పరిస్థితి వందేళ్లలో ఎప్పుడు లేదు : పవన్ కళ్యాణ్ 

14 th Oct 2020, UTC

భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. రోడ్ల మీద నీళ్లు ఎక్కువగా నిండిపోయి నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు సైతం పూర్తిగా మునిగిపోయాయి. రెండు రాష్ట్రాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రైతులు వేసుకున్న పంటలు నీటిపాలయ్యాయి. ఈ నేపధ్యంలో ప్రజలను ఆదుకోవాలంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజలకు చేయూతనివ్వాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను పవన్ కోరారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర వాయుగుండం కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. ఓ వైపు కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బకి అల్లాడుతున్న ప్రజలకు ఈ వాయుగుండం మరింత నష్టాన్ని చేకూరుస్తోంది. తెలంగాణాలో 13 మంది, ఆంధ్రప్రదేశ్ లో ఆరుగురు జల విలయం కారణంగా మృతి చెందడం దురదృష్టకరం అని పవన్ పేర్కొన్నారు. హైదరాబాద్ పాతనగరంలో ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని పవన్ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కూడా రైతన్నలను ఈ వరద నట్టేట ముంచింది. వరి, మొక్కజొన్న, పత్తి, మిరప వంటి పంటలతో పాటు ఇతర పంటలు కూడా ఈ భారీ వర్షాల తాకిడికి నాశనమయ్యాయి. ఏర్లు, వాగులు, చివరకు చెరువులు కూడా భారీ వరద తాకిడి కి ఉగ్ర రూపం చూపిస్తున్నాయి. ఇంతటి భయానక వర్షాలు. ఈ వందేళ్లలో కురవలేదు. అంటే ఇపుడు ఉన్న పరిస్థితి ఎంత భయంకరంగా ఉందొ ఊహించుకోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు బాధితులకు అండగా ఉండాలి.

ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, రైతులకు ఉదారంగా నష్టపరిహారాన్ని అందించాలని పవన్ కళ్యాణ్ కోరారు. విద్యుత్ అంతరాయం కలుగుతున్న చోట. పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలన్నారు. జనసైనికులు కూడా ఈ ఆపద కాలం లో తమ వంతు సాయం చేయాలనీ విజ్ఞప్తి చేసారు. మరో రెండు రోజులు ఇలానే వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్న నేపధ్యంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాలాలు కూడా ప్రమాదకరంగా మారాయి. ఈ పరిస్థితిలో ప్రజలు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox