Breaking News

ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటే ఎవరి జీవితాలను వారే కాపాడుకోవడం... రాహుల్ గాంధీ

14 th Sep 2020, UTC

న్యూఢిల్లీ :ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటే ఎవరి జీవితాలను వారే కాపాడుకోవడమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మహమ్మారి ప్రజల ప్రాణాలు హరిస్తుంటే ప్రధానమంత్రి మోదీ నెమలితో కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్‌ మోదీ సర్కార్‌ తీరుపై సోమవారం ట్విట్టర్ లో  విమర్శలు గుప్పించారు.
 
అహంకారపూరిత ధోరణితో  అప్రకటిత లాక్డౌన్‌ కారణంగా దేశంలో కరోనా వ్యాప్తి పెరిగిపోయిందని  రాహుల్ అన్నారు. రాహుల్‌ గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ప్రధానమంత్రి నెమలితో గడుపుతున్న వీడియోను పోస్ట్‌ చేశారు. అందులో ప్రధాని మోదీ నెమలితో నడుస్తూ వ్యాయామాలు చేస్తుండటం కనిపించిందికేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ రాహుల్‌ ట్వీట్లకు దీటుగా బదులిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ట్వీట్ల పార్టీగా మారిందని చురకలు వేశారు. ఆ పార్టీ ప్రజల కోసం పనిచేయడం లేదని, దీంతో రోజుకు ఒక నాయకుడు కాంగ్రెస్‌ను వీడుతున్నారని  ఆయన అన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox