Breaking News

దోచేస్తున్నవాడిపాలయిందిరో తెలంగాణ.. రేవంత్ రెడ్డి

13 th May 2022, UTC

Hyderabad: టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి హైదరాబాద్ లో దాదాపు ఎకరం భూమిని కేటాయిస్తూ కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు  హైదరాబాద్ నడిబొడ్డున వందలకోట్ల విలువైన భూమిని కొట్టేయడానికి ప్లాన్ వేసారని, అందులో భాగంగానే టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం పేరిట నాటకాలాడుతున్నారని ప్రతిపక్షనేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఆ వ్యవహారం పై టిపిసిపి చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. 

దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూమి లేదు. గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి లేదు. టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు నగరం నడిబొడ్డున రూ.100 కోట్ల విలువైన భూమి అప్పనంగా కొట్టేయడానికి మాత్రం  భూమి ఉంది. ఎవని పాలయిందిరో తెలంగా. జాతి సంపద దోస్తున్నవాడి పాలయిందిరో తెలంగాణ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేసారు.

మరోవైపు బీజేపీ నాయకురాలు విజయశాంతి కూడ ఈ భూ కేటాయింపు పై మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి  ప్రభుత్వం రూ.70 కోట్ల విలువైన భూమిని కేటాయించిందన్నారు. ఎన్‌బీటీ నగర్‌లో గజం రూ.లక్షన్నర ధర పలుకుతోందన్నారు. కానీ, 2018 ఆగస్టు 16న ప్రభుత్వం విడుదల చేసిన పాల‌సీ ప్రకారం గజం రూ.100 చొప్పున టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ స్థలానికి రూ.4.93 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని విజయశాంతి మండిపడ్డారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox