Breaking News

తెలంగాణలో రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గించాలి.. విజయశాంతి

21 st Jul 2021, UTC

తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ విలువను ప్రభుత్వం పెంచిన విషయమై బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విటర్ వేదికగా స్పందించారు. భూముల విలువను పెంచడం ద్వారా కొతమేరకైనా నల్లధనాన్ని తగ్గించవచ్చని అయితే పేద ప్రజల గురించి కూడా ఆలోచించి ఉంటే బాగుండేదని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచటం వల్ల కొంత మేరకైనా నల్లధనాన్ని ప్రభుత్వం తగ్గించగలిగే అవకాశం ఉండవచ్చు అది సమర్ధనీయమే. అయితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచకుండా, మరికొంత తగ్గించడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు భారం కలగకుండా చూసుకోవచ్చని ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. 

అలాగే ఎల్ఆర్ఎస్ భారం సామాన్యులపై మొత్తంగా నెత్తిన పడకుండా పూర్వపు ధరలు ప్రామాణికంగా నిర్ణయించడం కూడా ఇక్కడ పరిశీలనలోకి తీసుకుని తీరటం అవశ్యం అని విజయశాంతి ట్వీట్ చేసారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox