Breaking News

ముందస్తు ఎన్నికలు లేవు.. సీఎం కేసీఆర్

18 th Oct 2021, UTC
ముందస్తు ఎన్నికలు లేవు.. సీఎం కేసీఆర్

ముందస్తు ఎన్నికలకు  వెళ్లడం లేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.  ఆదివారం జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ  సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని తెలిపారు. ఇంకా రెండేళ్లు ఉందని, అన్ని పనులు చేసుకుందామన్నారు. మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా పనిచేయాలని సూచించారు .ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా నవంబర్‌ 15న వరంగల్‌ ప్రజాగర్జన సభను నిర్వహించాలన్నారు. మనపై మొరిగే కుక్కలు నక్కల నోర్లు మూయించాలని సూచించారు.

మరోవైపు హుజురాబాద్‌ ఉప ఎన్నికపై కూడ కేసీఆర్  చర్చించారు. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా వరంగల్ ప్రజాగర్జన సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రోజూ 20 నియోజకవర్గాలకు సన్నాహక సమావేశాలు నిర్వహించాలని సూచించారు.  . హుజురాబాద్ ఉప ఎన్ని కల్లో మనమే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 27 హుజురాబాద్ లో కేసీఆర్ ప్రచార సభ నిర్వహించనున్నారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox