Breaking News

ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను.. జానారెడ్డి

03 rd May 2021, UTC
ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను.. జానారెడ్డి

భవిష్యత్‌లో తనకు ఇక ఎన్నికల్లో పోటీ చేయాలని లేదని, ఆ అవసరం కూడా తనకు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి ప్రకటించారు వయసు దృష్ట్యా ఇక తాను పోటీ చేయదలుచుకోవట్లేదని  ఆయన  స్పష్టం చేశారు.నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో పరాజయం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా తీర్పును గౌరవించి స్వాగతిస్తున్నానని అన్నారు.

తాను పార్టీ అధిష్టానం సూచన మేరకు కాంగ్రెస్ క్యాడర్‌లో ఉత్సాహం కల్పించేందుకే పోటీ చేశానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిన గౌరవం మేరకు ఈ ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు. తన మాట మేరకు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు.తెలంగాణ అవతరించిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో  నాగార్జునసాగర్ నుంచి పోటీ చేసిన జానారెడ్డి గెలిచారు.

అయితే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నోముల నర్సింహయ్య చేతిలో జానా రెడ్డి ఓడిపోయారు. 2020లో కరోనా వైరస్ వైరస్ సోకడంతో నరసింహయ్య మృతి చెందారు. దీంతో వచ్చిన ఉప ఎన్నికల్లో నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ బరిలో నిలవగా ఆయన చేతిలో జానా రెడ్డి తాజాగా పరాజయం పొందారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox