Breaking News

నవజోత్ సింగ్ సిద్ధూ బలప్రదర్శన 62 మంది ఎమ్మెల్యేలతో స్వర్ణదేవాలయం సందర్శన

21 st Jul 2021, UTC

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ బుధవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలతో స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. దాదాపు 62 మంది ఎమ్మెల్యేలను లగ్జరీ బస్సుల్లో తీసుకెళ్ళారు. అంతకుముందు వీరంతా అమృత్‌సర్‌లోని సిద్ధూ నివాసంలో సమావేశమయ్యారు. సిద్దూకు ప్రాధాన్యత కలిగిన పదవిని ఇవ్వడానికి సీఎం అమరీందర్ సింగ్ చివరివరకూ అడ్డుపడిన నేపధ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ సమావేశానికి హాజరయిన వారిలో రాష్ట్రమంత్రులు, తాజా మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ కూడ వున్నారు. రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 80. అంటే కేవలం 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఈ సమావేశానికి దూరంగా వున్నారు. మంగళవారం అమృత్‌సర్‌లోని ఒకటో నెంబరు జాతీయ రహదారి నుంచి అమృత్‌సర్ ప్రధాన ప్రవేశ ద్వారం గోల్డెన్ గేట్ వరకు  సిద్దూకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పూలమాలలు, బ్యానర్లు, జెండాలతో ఆయనకు స్వాగతం పలికారు. 

మరో వైపు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మీడియా సలహాదారు రవీన్ ఠుక్రాల్ సింగ్‌ ట్విట్టర్ లో సీఎం నుకలిసేందుకు సిద్ధూ సమయాన్ని కోరినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా తప్పని తెలిపారు. తమ వైఖరిలో ఎటువంటి మార్పు లేదన్నారు. కెప్టెన్ సింగ్‌ను వ్యక్తిగతంగా అవమానిస్తూ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులకు సిద్దూ బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు అతడిని ముఖ్యమంత్రి కలవబోరని తెలిపారు. దీనితో సీఎం, పీసీసీ అధ్యక్షుల మధ్య దూరం తగ్గలేదని తెలుస్తోంది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox