Breaking News

నిత్యావసరాల బస్తాలను మోసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

24 th Nov 2021, UTC

చిత్తూరు జిల్లా రాయలచెరువు వద్ద తీవ్ర ఆందోళన నెలకొంది చెరువు కట్టకు ఏర్పడిన స్వల్ప గండి క్రమంగా పెరుగుతున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. గండి పడిన ప్రాంతంలో కొద్ది కొద్దిగా మట్టి జారిపడుతుండటంతో  నీరు  లీకేజీ మరింత పెరిగినట్లు తెలుస్తోంది. దీన్ని చూసిన స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎపుడు ఏమవుతుందోనని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. ఇప్పటికే చెరువు పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు. పునరావాస కేంద్రాల్లో వేలాది మంది ప్రజలు తలదాచుకుంటున్నారు. మరోవైపు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడంపై దృష్టి కేంద్రీ కరించారు.

రాయల చెరువు సమీపంలో వరద ముంపు ప్రజలకు నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హమాలీగా మారి బస్తాలను మోసారు. మంగళవారం తిరుపతి విమానాశ్రయం నుంచి ఆర్సీపురం మండలంలోని 11 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన 10 టన్నుల నిత్యావసర సరుకులు హెలికాప్టర్‌ ద్వారా వచ్చాయి. ఆ బస్తాలను చెవిరెడ్డి తన సహచరులతో కలిసి హెలికాప్టర్‌ నుంచి కిందకు దించి ముంపు బాధితులకు అందజేశారు.

వరద ముంపు నేపథ్యంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో అలమటించే పరిస్థితి ఉండకూడదని, చెరువుకు గండి పడినా ఏ ఒక్కరికీ ప్రాణహాని జరగకూడదనేది సీఎం జగన్‌ ఆదేశించారని ఆయన చెప్పారు. ఇప్పటికే 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ముంపు బాధితులకు సత్వర సాయం అందించేందుకు నేవీ హెలికాప్టర్ల ద్వారా దాదాపు 5 వేల మందికి నిత్యావసర సరుకులను గ్రామాలకు చేర్చినట్టు చెవిరెడ్డి  తెలిపారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox