Breaking News

ప్రధాని మోదీ కి ఒవైసీ ప్రశ్న..!

04 th Jul 2020, UTC
 ప్రధాని మోదీ కి ఒవైసీ ప్రశ్న..!

ప్రధాని మోదీ లడక్ పర్యటనలో చైనా పేరు ప్రస్తావించకపోవడంపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. మోదీ ఎందుకు వెనుకాడుతున్నారంటూ నిలదీశారు. ఈ మేరకు ఒవైసీ శుక్రవారంనాడు వరుస ట్వీట్లు చేశారు.

ప్రధాని గారూ...మీరు మన సైనికులకు, గాయపడిన జవాన్లకు కలుసుకోవడం మంచిదే. వారితో మాట్లాడటంతో వారి నైతిక స్థైర్యం కూడా తప్పనిసరిగా  పెరుగుతుంది' అని ఒవైసీ పేర్కొన్నారు. 'మన దేశంలోకి ఎవరూ ప్రవేశించలేదు...ఎవరూ లేరు'... అంటూ మోదీ ఇటీవల అఖిలపక్ష సమావేశంలో మాట్లాడిన క్లిప్‌ను కూడా ట్వీట్‌కు జోడించారు.

మోదీ లడక్‌ పర్యటనతో దేశంలోకి శత్రువు చొరబడ్డాడనే విషయం నిరూపితమవుతోందని, చైనా పేరెత్తడానికి మోదీ ఎందుకు వెనుకాడుతున్నారని ఒవైసీ మరో ట్వీట్‌లో ప్రశ్నించారు. పూర్తి స్థాయి యుద్ధం జరిగితే మన దగ్గరున్న నిల్వలు 12 రోజులు మత్రమే సరిపోతాయనే విషయం 'చౌకీదార్‌'కు తెలుసా అని ప్రశ్నించారు.

'గల్వాన్ కావచ్చు, హాట్ స్ప్రింగ్స్, పాంగాంగ్ టీఎస్ఓ, డెప్సంగ్‌లలో పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఆ కారణంగానే త్వరలో పార్లమెంటు సమావేశాలు జరపాలని కోరుతున్నాను. తద్వారా ప్రభుత్వ జవాబుదారీతనాన్ని విపక్షాలు ప్రస్తావించడం, భారత భూభాగం ఆక్రమణల గురించి ప్రశ్నించడం జరుగుతుంది' అని మరో ట్వీట్‌లో ఒవైసీ పేర్కొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox