Breaking News

కులరాజకీయాలు దుర్మార్గం.. ఈటల రాజేందర్ 

03 rd Apr 2021, UTC
కులరాజకీయాలు దుర్మార్గం.. ఈటల రాజేందర్ 

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. దొడ్డి కొమురయ్య జయంతి వేడుకల్లో  కులాల ప్రాతిపదికన రాజకీయాలు దుర్మార్గపు ఆలోచన అని అన్నారు. మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇది ఆత్మగౌరవ సమస్య, చైతన్యాన్ని చంపితే ఉన్మాదమే వస్తుందన్నారు. 

ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కింది కులాల మీద ఉందని వ్యాఖ్యానించారు. జానెడు భూమి కోసం ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ప్రభుత్వమే భూములను పేదలకు పంచుతుందని తెలిపారు. పట్టా భూముల సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈటల గత కొద్దికాలంగా తన దైన శైలిలో చేస్తున్న వ్యాఖ్యల వెనుక ప్రభుత్వం పై వున్న అసంతృప్తే కారణమని భావిస్తున్నారు. టీచర్, డాక్టర్ కావాలంటే మెరిట్ వుండాలని మరి పాలకులకు మెరిట్ అవసరం లేకపోతే ఎలా అని అన్నారు. అంతేకాదు ఫించన్లు, షాదీముబారక్ వలన పేదరికం పోదని కామెంట్ చేసారు. కొన్నేళ్ల కిందట మంత్రి పదవి తమ హక్కని అది అడుక్కుంటే వచ్చేది కాదని అన్నారు. 

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్బావం నుంచి వున్న తనకు సీఎం కేసీఆర్ పెద్దగా గౌరవం ఇవ్వలేదన్న భావన ఈటలలో వుందని తెలుస్తోంది. మరో వైపు ప్రతిపక్ష పార్టీలు కూడ ఈటల రాజేందర్ ను సీఎం చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox