Breaking News

మొబైల్ ఫోన్ కు ప్లాస్టర్ వేసాను.. కేంద్రానికి వేయాలి.. సీఎం మమతా బెనర్జీ

21 st Jul 2021, UTC

పశ్చిమ బెంగాల్ :పెగాసస్ స్పైవేర్‌తో అనేక మంది నేతలపై నిఘా పెట్టినట్లు వస్తున్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఈ ఆరోపణలపై స్వీయ విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరారు. తాను నిఘా నుంచి తప్పించుకోవడం కోసం తన మొబైల్ ఫోన్‌ కెమెరాకు ప్లాస్టర్ వేసేశానని, ఇక కేంద్ర ప్రభుత్వానికి ప్లాస్టర్ వేయవలసి ఉందని చెప్పారు. అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఆమె వర్చువల్ పద్ధతిలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు.

ఈ సందర్బంగా తన మొబైల్ ఫోన్ కెమెరాకు టేప్ అంటించి ఉండటాన్ని మమత బెనర్జీ చూపించారు. వీడియో అయినా, ఆడియో అయినా, అన్నిటినీ ట్యాప్ చేస్తున్నారని మండిపడ్డారు.  పెగాసస్ చాలా ప్రమాదకారి అని, వాళ్ళు (బీజేపీ) జనాన్ని వేధిస్తున్నారని చెప్పారు. తాను ఢిల్లీ, ఒడిశా ముఖ్యమంత్రులతో మాట్లాడలేకపోతున్నానన్నారు. కొన్నిసార్లు తాను ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నానని తెలిపారు. దేశాన్ని నిఘా రాజ్యంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దేశంలో స్పైగిరి జరుగుతోందని, మంత్రులు, జడ్జిల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. ఎన్నికల ప్రక్రియ, న్యాయ వ్యవస్థ, మంత్రులు, మీడియా హౌస్‌లను పెగాసస్ ఆక్రమించుకుందన్నారు. ప్రజాస్వామ్యానికి బదులుగా నిఘా రాజ్యంగా మార్చాలనుకుంటున్నారన్నారు. . రాష్ట్ర ప్రజలు తమకు ఓటు వేశారని, అందుకే తాము గెలిచామని తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox