Breaking News

ఉద్ధవ్ థాకరే కధ ముగిసిందా.. శివసేనలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఏక్ నాధ్ షిండే వైపే

23 rd Jun 2022, UTC

Maharashtra: మహారాష్ట్రలో శివసేన పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఏక్ నాధ్ షిండే వర్గం మెజారిటీ ఎమ్మెల్యేలను కూడగడుతోంది. తాజాగా మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు ముంబయిని విడిచిపెట్టి సీనియర్ నాయకుడు ఏక్‌నాథ్ షిండేకు మద్దతుగా నిలిచారు. దీనితో పార్టీకి చెందిన 55 మంది ఎమ్మెల్యేలలో 40 మంది షిండే వైపు చేరినట్లు అయింది.

దీపక్ కేశకర్ (సావంత్‌వాడి నుండి ఎమ్మెల్యే), మంగేష్ కుడాల్కర్ (చెంబూర్) మరియు సదా సర్వాంకర్ (దాదర్) ఉదయం ముంబై నుండి గౌహతికి విమానంలో బయలుదేరారు. కనీసం 40 మంది ఎమ్మెల్యేలు రెబల్స్‌లో చేరినట్లు సమాచారం. ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా షిండే వెంట ఉన్నారు. అయితే ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి మాకు తగినంత అనుభవం ఉంది అని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ చెప్పారు. 20 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారు. మరోవైపు మహారాష్ట్రలో శివసేన కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్‌సిపి పాలక కూటమిని చుట్టుముట్టిన భారీ రాజకీయ సంక్షోభం నుంచి బయటపడేందుకు రెబల్ ఏకనాథ్ షిండే ను ముఖ్యమంత్రిగా నియమించాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శివసేన తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న ఏకనాథ్ షిండే, పాలక కూటమి కూటమి భాగస్వాములకు మాత్రమే ప్రయోజనకరంగా ఉందని, గత రెండున్నరేళ్ల సంకీర్ణ పాలనలో సాధారణ శివసైనికులు ఎక్కువగా నష్టపోయారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం అని తిరుగుబాటు సేన ఎమ్మెల్యేలతో కలిసి గౌహతిలో క్యాంప్ చేస్తున్న షిండే బుధవారం ట్వీట్ చేశారు.

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం శివసేన అంతర్గత వ్యవహారమని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమ పార్టీ  ప్రయత్నాలు  చేయడం లేదని బీజేపీ చెబుతోంది. "మేము ఏక్‌నాథ్ షిండేతో మాట్లాడలేదు. ఇది శివసేన అంతర్గత విషయం. బీజేపీకి దీనితో సంబంధం లేదు. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి హక్కును కోరడం లేదు" అని పార్టీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన కేంద్ర మంత్రి రావుసాహెబ్ పాటిల్ దన్వే, మీడియాకు చెప్పారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox