Breaking News

తమిళనాడు గవర్నర్ వార్తలపై స్పందించిన కృష్ణం రాజు..!

20 th Jan 2021, UTC

బీజేపీ నేత, సీనియర్ నటుడు కృష్ణంరాజు తమిళనాడు గవర్నర్ గా ఎంపికయ్యారని  కొన్ని రోజుల క్రితం అన్ని వార్తా మాధ్యమాల్లోను కధనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వార్తలపై తాజాగా కృష్ణం రాజు సంప్రదించారు. తనను తమిళనాడు గవర్నర్ గా పంపిస్తున్నట్లు అన్ని న్యూస్ ఛానెళ్లలో వార్తలు వచ్చాయన్నారు, కానీ వాటిని రాసేముందు, రాసాక తనను ఎవరు సంప్రదించలేదన్నారు. ఈ వార్తలలో నిజం లేదని, ప్రభుత్వం నుంచి అధికారికంగా సమాచారం రాలేదని అన్నారు.

తనకు గవర్నర్ పదవి ఇస్తే బాగుంటుందని అందరు కోరుకోవడం వల్లే ఇలాంటి వార్తలు వచ్చి ఉంటాయని కృష్ణం రాజు అభిప్రాయపడ్డారు. ఇలాంటి వార్తలు తనకు ఇష్టం లేవని, వచ్చిన తరువాత వచ్చింది అని చెప్పుకోవడం బాగుంటుంది. కానీ రాకుండానే ఇలా ప్రచారం జరగడం అంత బాగోలేదని అన్నారు. కృష్ణం రాజు ఇంకా ప్రధాని నరేంద్ర మోడీ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి ప్రధాని మాకు కూడా కావాలి అని కోరుకుంటున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ వెనకబడిందా అని ఓ విలేఖరి ప్రశ్నించగా, అలాంటిదేమి లేదని, ఒకప్పుడు రెండు ఎంపీ సీట్లు మాత్రమే ఉన్న బీజేపీ ప్రస్తుతం దేశాన్ని పాలిస్తోందన్నారు.తానూ పార్టీలోకి రాకముందు రెండుగా ఉన్న ఎంపీల సంఖ్యా పార్టీలోకి వచ్చాక మరింత పెరిగిందన్నారు. తానూ రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నానని, ఎప్పటికప్పుడు తన సలహాలను, సూచనలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాకు మెయిల్ ద్వారా పంపుతుంటానని వివరించారు. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox