Breaking News

కేసీఆర్‌ పాస్‌పోర్ట్‌ల బ్రోకర్‌.. బండి సంజయ్ 

29 th Oct 2020, UTC

దుబ్బాక :సీఎం కేసీఆర్‌ పాస్‌పోర్ట్‌ల బ్రోకర్‌ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు  బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులను ముంచి కోట్లు సంపాదించారని ఆరోపించారు. కులాలను అడ్డుపెట్టుకొని మంత్రి పదవి పొందినవారు వారిని నట్టేట ముంచి కేసీఆర్ కాళ్ల వద్ద మోకరిల్లుతున్నారని మండిపడ్డారు. నీచమైన అవినీతిపరుడైన సీఎంను ఎన్నుకున్నందుకు దేశమే ప్రశ్నిస్తుంటే రాష్ట్ర ప్రజలు తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. బీసీలను తెలంగాణ సీఎం నట్టేట ముంచుతున్నారని దుయ్యబట్టారు. 

ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు కూడా ఎన్నికల్లో పోటీ చేసేలా చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తే బీజేపీ అడ్డుకుందని తెలిపారు. కొండగట్టు బస్సు ప్రమాదంపై కేసీఆర్‌ మాట్లాడలేదన్నారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలకు ఇళ్లు నీటమునిగితే కేసీఆర్‌ మాత్రం ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని తప్పుబట్టారు. కేంద్రానికి వ్యవసాయ పంపుసెట్ల వద్ద మీటర్లు పెట్టే యోచనలేదని, మీరు ఎక్కడైనా మీటర్లు పెడితే మీ సంగతి తేలుస్తామని బండి సంజయ్‌ హెచ్చరించారు.దుబ్బాకలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. మీటర్లు పెట్టేది మోటార్లకు కాదని, టీఆర్ఎస్‌కని అన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్‌కు సరైన బుద్ధి చెబుతామన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox