Breaking News

చరిత్రనుకేసీఆర్ కనుమరుగు చేస్తున్నాడు.. బండి సంజయ్

14 th Sep 2021, UTC

నిజాం కుటుంబానికి భయపడే.. విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా.. మెదక్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్.. మాట తప్పారనిఅన్నారు. చరిత్రనుకేసీఆర్ కనుమరుగు చేస్తున్నాడని ఆయన  మండిపడ్డారు.ఎన్నికలు వచ్చినప్పుడే ముఖ్యమంత్రికి.. ఉద్యోగాలు, నోటిఫికేషన్‌లు గుర్తుకొస్తాయని విమర్శించారు. నిరుద్యోగ భృతి, రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు ఎందుకు ఇవ్వడం లేదని  ప్రశ్నించారు. మళ్ళీ కొత్తగా పేద వారి బంధు అంటున్నారని ఎద్దేవాచేశారు. 

బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ వాళ్ళతో కేసీఆర్ చెప్పిస్తున్నాడని తెలిపారు.ఓల్డ్ సిటీలో పోటీ చేసే దమ్ము టీఆర్ఎస్‌కు లేదన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి ఎప్పటికీ వెళ్ళరని చెప్పారు. రాష్ట్రంలో రైతులు వ్యవసాయం చేసే పరిస్థితిలో లేరన్నారు. అమిత్‌షా నిర్మల్ సభను జయప్రదం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపాలని టీఎస్ హైకోర్టులో న్యాయవాది జనార్దన్ గౌడ్ పిల్ దాఖలు చేశారు. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని పిటిషనర్ కోరారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకం ఎగురువేయాలని పిటిషనర్ కోరారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox