Breaking News

కోయంబత్తూర్ సౌత్‌ లో ఓడిన కమల్ హాసన్

03 rd May 2021, UTC
కోయంబత్తూర్ సౌత్‌ లో ఓడిన కమల్ హాసన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజక వర్గం కోయంబత్తూర్ సౌత్‌. ఎందుకంటే ఇక్కడ మక్కల్ నీది మయం పార్టీ అధినేత కమల్ హాసన్ ఎమ్మెల్యేగా పోటీ చేసారు. ఆయనకు ప్రత్యర్దులుగా బీజేపీ జాతీయ మహిళా అధ్యక్షురాలు వనాతి శ్రీనివాసన్ , కాంగ్రెస్ నుంచి మయూరా జయకుమార్ వున్నారు. ఈ ముక్కోణపు పోటీలో చివరికి వనాతి శ్రీనివాసన్  1500 ఓట్ల తేడాతో కమల్ హాసన్ పై గెలుపొందారు.

కౌంటింగ్ లో మొదట ఎంఎన్‌ఎం చీఫ్ కమల్ హాసన్ ముందున్నారు.అయితే కొన్ని రౌండ్ల తరువాత  జయకుమార్ కు మెజారిటీ వచ్చింది. ప్రారంభంలో మూడవ స్థానంలో వున్న వనాతి శ్రీనివాసన్ తరువాత పుంజుకుని చివరకు స్వల్ప మెజారిటీలో గెలుపొందారు.2008 లో నియోజక వర్గాల పునర్విభజనలో  కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గం ఏర్పడింది.

ఈ నియోజకవర్గం నుంచి 2011 లో మొదటి ఎమ్మెల్యేగా ఎఐఎడిఎంకె  నుంచి ఆర్ డోరైసామి గెలుపొందారు. 2016 లో, ఎఐఎడిఎంకె అభ్యర్ది అమ్మాన్ కె అర్జునన్  ఎన్నికయ్యారు.సుమారు 1.75 లక్షల మంది ఓటర్లు వున్న ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు మక్కల్ నీది మాయం (ఎంఎన్‌ఎం) చీఫ్, నటుడు కమల్ హాసన్ ప్రకటించడంతో నియోజకవర్గం  అందరి దృష్టిని ఆకర్షించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox