Breaking News

టైమ్ చూసుకుని ఎంట్రీ ఇచ్చిన కేఏ పాల్.. బీజేపీకి కౌంటర్లు..!

05 th Jan 2021, UTC

ఎపి పాలిటిక్స్ లో కె ఏ పాల్ కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్లిపోతుంటారు. 2019 ఎన్నికల టైమ్ లో నానా హడావిడి చేసిన కె ఏ పాల్ ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక మళ్ళీ కనిపించలేదు. తాజాగా, ఆయన బీజేపీ పై తనదైన స్టయిల్ లో కౌంటర్లు వేశారు. "ఓ తెలంగాణ బీజేపీలోకల్ నాయకుడు ఏమి మాట్లాడుతున్నారో తెలీదు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అంటూ బండి సంజయ్ పై పరోక్షంగా విమర్శలు కురిపించారు. "బైబిల్ పట్టుకున్నవారికి ఓటు వేస్తారా? భగవద్గీత పట్టుకున్నవాళ్లకు ఓటు వేస్తారా? అని, ఇంత లోలెవల్‌కు దిగిపోతారా? " అంటూ ఎద్దేవా చేశారు. ఏదైనా మాట్లాడే ముందు నేషనల్ లీడర్ల తో సంప్రదించాలని హితవు చెప్పారు.

ఆర్ఎస్ఎస్ నాయకులు ఇంద్రస్, బయాజోషి చాలాసార్లు ఆయన హోటల్ కి వచ్చారని, దేశాన్ని ఉద్దరించాలని కోరారని చెప్పుకొచ్చారు. రామ్ లాల్ అయితే ఆయన మోకాలుని తాకి, చేతిని కిస్ చేసినట్లు తెలిపారు. బీజేపీకి సపోర్ట్ చేయాలనీ, అభివృద్ధి హెల్ప్ చేయాలనీ కోరినట్లు తెలిపారు. రెండొందల దేశాల్లో మోడీ బ్లాక్ లిస్ట్ లో ఉన్న సమయంలో ఎంతో గౌరవించారని చెప్పుకొచ్చారు. అలాగే, అమిత్ షా, జెపి నడ్డా వంటి బీజేపీ నేతలు కూడా ఆయన హోటల్ కి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. అందరిని కలుపుకుపోదాం అంటుంటే, కుళ్ళు, కుట్రలతోనే మతాల గురించి మాట్లాడుతున్నారు. మోడీ ట్రంప్ చుట్టూ తిరిగారు, ట్రంప్ నా చుట్టూ 18 సంవత్సరాలు తిరిగారు. చిత్తూగా ఓడిస్తానని చెప్పా. చెప్పినట్లే జరిగింది. పరిశుద్ధ గ్రంధాలతో ఆటలు వద్దు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

ఆ తరువాత చంద్రబాబు నాయుడు పై కూడా ధ్వజమెత్తారు. "చంద్రబాబు నాయుడికి సిగ్గు లేదు. ఆయన కొడుకుని సీఎం చేయాలనీ పగటి కలలు కంటున్నారా? ఇప్పటివరకు పాల్ గారు, ఏసుక్రీస్తు మహిమా అంటూ పొగిడి, ఇపుడు క్రైస్తవమతాన్ని దూషిస్తారా అంటూ మండిపడ్డారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ కు కూడా హితబోధ చేసారు. "ఇప్పటికైనా మేలుకో పవన్ కళ్యాణ్. కరివేపాకుని వాడుకున్నట్లు వాడుకుని వదిలేస్తారు. తిరుపతిలో బీజేపీ అభ్యర్థినే పెట్టి నిన్ను వదిలేసారు. ఓ పెద్ద కాపు నాయకుడు ఆయనతో మాట్లాడినట్లు తెలిపారు. రాజకీయం చేయాలనుకుంటే, హిందువులు, క్రైస్తవులు, మహమ్మదీయులు ఇలా అందరిని కలుపుకుంటూ పోదాం అని పిలుపునిచ్చారు. దాదాపు 32 సంవత్సరాల పాటు అమెరికాలో ఉండి, ఇండియా స్థానాన్ని మూడవ స్థానానికి తీసుకొచ్చాను. కానీ, ఇపుడు ఇండియాలో అభివృద్ధి లేదు. అప్పులు మాత్రమే ఉన్నాయి. 144 వ దేశంగా భారత్ పడిపోయింది. ఆనాడు, మోడీ, అమిత్ షా, జెపి నడ్డా, వంటి బీజేపీ పెద్దలు దేశాన్ని అభివృద్ధి చేస్తా అంటూ ప్రామిస్ చేశారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేశాను. కానీ భారత్ నష్టపోయింది. ఇంకా నష్టపోకుండా కాపాడుతున్నా.. మానవత్వం ఉన్న వారు ఎవరు తిరుపతిలో బీజేపీకి ఓటు వేయకండి" అంటూ కె ఏ పాల్ పేర్కొన్నారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox