Breaking News

ఇది కాంగ్రెస్ పార్టీయా? లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

24 th Sep 2021, UTC

అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గాను శుక్రవారం  తెలంగాణ సీఎల్పీ సమావేశానికి ముందు పార్టీ సీనియర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగ్గారెడ్డి  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై  మండిపడ్డారు.

ఇది కాంగ్రెస్ పార్టీయా? లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా అని ప్రశ్నించారు. పార్టీ సీనియర్లతో చర్చించకుండానే రెండు మాసాల కార్యాచరణను ఎలా ప్రకటిస్తారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. జహీరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ విషయంలో గీతారెడ్డికి సమాచారం ఇవ్వరా? అని ఆయన  ప్రశ్నించారు. సంగారెడ్డికి వస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నాకే సమాచారం ఇవ్వరా? అని ఆయన అడిగారు. కనీసం ప్రోటోకాల్ పాటించాలి కదా అని అడిగారు.

సమాచారం ఇవ్వకుండా నాతో విబేధాలు ఉన్నట్టు రేవంత్  చెప్పాలని అనుకొంటున్నారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.కాంగ్రెస్ లో ఏ ఒక్కరో హీరో కాలేరని ఆయన చెప్పారు.గత శనివారం నాడు జూమ్ మీటింగ్ లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రెండు మాసాల కార్యాచరణపై చర్చించారు.ఈ సమావేశానికి కొందరు సీనియర్లు హాజరు కాలేదు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox